అన్వర్ఖాన్కు నియామకపత్రాన్ని అందజేస్తున్న శ్రీనివాస్
మొయునాబాద్ రూరల్, జనవరి 23: అసైన్డ్ భూములను ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాల పేరిట బలవంతంగా లాక్కుంటుందని అసైన్డ్భూముల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శ్రీనివాస్ ఆరోపించారు. ఆదివారం అసైన్డ్ భూములకు చెందిన రైతులతో ఆయన సమావేశమయ్యారు. పేదలకు తిరిగి భూములు దక్కే విధంగా పోరాటం చేస్తామన్నారు. అనంతరం అసైన్డ్భూముల పరిరక్షణ సమితి మండల వర్కింగ్ ప్రెసిడెంట్గా మొయునాబాద్కు చెందిన మైనార్టీ నాయకుడు మహ్మద్ అన్వర్ఖాన్ను ఎంపిక చేసి నియామకపత్రాన్ని అందజేశారు.