సాగునీటి ప్రాజెక్టుల ఆధునికీకరణకు కృషి

ABN , First Publish Date - 2021-04-18T04:45:36+05:30 IST

ఆసిఫాబాద్‌ నియోజక వర్గంలో సాగునీటి ప్రాజెక్టుల ఆధునికీకర ణకు ప్రత్యేక కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే ఆత్రంసక్కు తెలిపారు.

సాగునీటి ప్రాజెక్టుల ఆధునికీకరణకు కృషి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆత్రం సక్కు

- ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు

ఆసిఫాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 17: ఆసిఫాబాద్‌ నియోజక వర్గంలో సాగునీటి ప్రాజెక్టుల ఆధునికీకర ణకు ప్రత్యేక కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే ఆత్రంసక్కు తెలిపారు. శనివారం మండలంలోని తుంపల్లి పంచా యతీ పరిధిలో గల పులిఒర్రె చెరువు వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజక వర్గంలో వట్టివాగు, కుమరంభీం ప్రాజెక్టు, ఎన్టీఆర్‌ సాగర్‌, అమ్మనమడుగు తదితర ప్రాజెక్టులతో పాటు పలు చెరువుల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయని అన్నారు. నిర్వహణ లేక లక్ష్యం మేరకు సాగునీరం దడం లేదన్నారు. వాటి మరమ్మతులకు అవసరమైన నిధుల మంజూరుకు ఇటీవల ముఖ్యమంత్రిని కలిసి విన్నవించామన్నారు. అంతేకాకుండా జిల్లాలోని అన్ని జలాశయాలపై సమగ్ర నివేదికను నీటి పారుదలశాఖ ఆధ్వర్యంలో తయారు చేయించి ముఖ్యమంత్రికి నివేది స్తామన్నారు. పులిఒర్రె కాలువ జంగిల్‌ కటింగ్‌, పూడిక తీత పనుల కోసం నీటి పారుదల శాఖ ఇంజనీరింగ్‌ అధికారులు రూ.18లక్షలతో ప్రతిపాదనలు తయారు చేశారని అన్నారు. కలెక్టర్‌తో చర్చించి నిధుల మంజూరుకు కృషి చేస్తానని అన్నారు. బీజేపీ నాయకుడు ఆత్మారాం నాయక్‌ మాట్లాడుతూ చెరువుకు త్వరలో మరమ్మతులు చేయకుంటే రైతులతో కలిసి కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలుపుతామన్నారు. చెరువు నిర్మాణంతో ప్రయోజనం ఉంటుందని భూములు త్యాగం చేశామని, అయినా కొంత మందికి పరిహారం అందలేద న్నారు. రూ.15.90 కోట్లు వెచ్చించి నిర్మించిన చెరువు ఏనాడు ఒక్క ఎకరానికి నీరందలేదని, దీంతో వర్షాదారంపైనే పంటలు సాగు చేసుకోవాల్సి వస్తోందన్నారు. భూములను కౌలుకు ఇస్తామన్నా రైతులు ముందుకు రావడం లేదని వాపోయారు.  కార్యక్రమంలో ఎంపీపీ మల్లికార్జున్‌ యాదవ్‌, సర్పంచ్‌ వరలక్ష్మి, మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ చిన్నమల్లన్న, మాజీఎంపీపీ బాలేష్‌గౌడ్‌, నీటి పారుదలశాఖ ఈఈ గుణవంతరావు, ఏఈలు, నాయకులు, సలాం ఉన్నారు. 

Updated Date - 2021-04-18T04:45:36+05:30 IST