గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

ABN , First Publish Date - 2022-01-20T06:19:31+05:30 IST

గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే రమావత రవీంద్రకుమార్‌ అన్నారు.

గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి
పెద్దఅడిశర్లపల్లిలో వైకుంఠధామాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌

 ఎమ్మెల్యే రమావత రవీంద్రకుమార్‌ 

పెద్దఅడిశర్లపల్లి, జనవరి 19: గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే రమావత రవీంద్రకుమార్‌ అన్నారు. బుధవారం మం డల కేంద్రంలో వైకుంఠధామం, బాలాజీనగర్‌ గ్రామ పంచాయతీలో కమ్యూనిటీ హాల్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు.  రాష్ట్ర ఆవిర్భావం అనంతరం పల్లెల్లో ప్రగతి విప్లవం ప్రారంభమైందని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా టీఆర్‌ఎస్‌ ప్ర భుత్వం పని చేస్తుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ పకడ్బందీగా అమలవుతున్నాయన్నారు. గ్రామాలు సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం వద్దిపట్ల గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త ఏడుకొండలు ఇటీవల మృతి చెందడంతో టీఆర్‌ఎస్‌ ప్రమాద బీమా పథకం కింద మం జూరైన రూ.2లక్షల చెక్కును అతని భార్యకు ఎమ్మెల్యే అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ వంగాల ప్రతా్‌పరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన వల్లపురెడ్డి, ఎంపీడీవో మోహనరెడ్డి, సర్పంచ గోర్ల సైదమ్మ, మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌చైర్మన ముచ్చ ర్ల ఏడుకొండలు, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన చిరసువాడ శ్రీనయ్య, ముత్యపురావు, మార్కెట్‌ డైరెక్టర్‌ ఎర్ర యాదగిరి, పరమేష, బన్సీలాల్‌, శేఖర్‌రెడ్డి, కర్ణయ్య, ముసలయ్య, శ్రీనువాస్‌ తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2022-01-20T06:19:31+05:30 IST