టీఆర్‌ఎస్‌ బలోపేతానికి కృషి చేయాలి

ABN , First Publish Date - 2022-01-17T05:08:48+05:30 IST

టీఆర్‌ఎస్‌ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పిలుపునిచ్చారు. స్థానిక మార్కండేయకాలనీలో ఆదివారం నిర్వహించిన సమన్వయ కమిటీ సభ్యుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు

టీఆర్‌ఎస్‌ బలోపేతానికి కృషి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే చందర్‌

- ఎమ్మెల్యే చందర్‌
గోదావరిఖని, జనవరి 16: టీఆర్‌ఎస్‌ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని  ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పిలుపునిచ్చారు. స్థానిక మార్కండేయకాలనీలో ఆదివారం  నిర్వహించిన సమన్వయ కమిటీ సభ్యుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమన్వయ కమిటీ సభ్యులు నియోజకవర్గంలోని పార్టీని బలోపేతానికి కృషి చేయాలన్నారు. సమాఖ్య పాలనలో రామగుండం నియోజకవర్గం ఏ మాత్రం అభివృద్ధి చెందలేదని, సీఎం కేసీఆర్‌ రామగుండానికి రూ.200కోట్ల నిధులు కేటాయించి అండగా నిలిచారని చెప్పారు. కొంత మంది అసత్య ఆరోపణలు చేస్తున్నారని, వీటిని తిప్పికొట్టాలని ఆయన సూచించారు. ఆరోపణలు చేసే వారిని నిలదీయాలని, పార్టీ పట్ల అంకిత భావంతో కృషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ బంగి అనీల్‌ కుమార్‌, అధికార ప్రతినిధులు దీటి బాలరాజు, పాతిపెల్లి ఎల్లయ్య, నారాయణదాసు మారుతి, అడ్డాల రామస్వామి, తానిపర్తి గోపాల్‌రావు, అచ్చె వేణు పాల్గొన్నారు.
 పారిశ్రామిక ప్రాంతానికి పునర్వవైభవం
సింగరేణిలో ఒక్కొక్క బొగ్గు బాయి మూత పడుతూ కార్మికుల సంఖ్య తగ్గి కార్మికులు తమ సొంత ఊర్లకు వెళ్లిపోతున్నారని, దీంతో పారిశ్రామిక ప్రాంతం నిర్వీర్యం అవుతుందని, రామగుండానికి తిరిగి పూర్వ వైభవం తీసుకురావడానికి మెడికల్‌ కళాశాల, ఐటీ టవర్‌ ఏర్పాటుతో పూర్వ వైభవం తీసుకువస్తున్నట్టు ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అన్నారు. ఆదివారం అడ్డగుంటపల్లిలోని రామగుండం ఏరియా కన్జుమర్‌ ప్రోడక్ట్స్‌ డిస్ర్టిబ్యూటర్స్‌ అండ్‌ కెమిస్ర్టి అండ్‌ డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాంతానికి వచ్చిన జేఎన్‌టీయూ కళాశాలను మంథనికి తరలించుకుపోయారని చెప్పారు. ఇక్కడ అపార బొగ్గు నిక్షేపాలు, నీళ్లు ఉన్నా నిర్లక్ష్యం చేశారని, ఈ ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకురావడానికి ముఖ్య కేసీఆర్‌ మెడికల్‌ కళాశాల, ఇండస్ర్టియల్‌ కారిడార్‌, ఐటీ పార్కును తీసుకువచ్చారని, దీంతో మళ్లీ జనంతో కళకళలాడుతుందని చెప్పారు. మెడికల్‌ కళాశాల ఏర్పాటుతో సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు.  కార్యక్రమంలో మేయర్‌ బంగి అనీల్‌ కుమార్‌, కార్పొరేటర్లు జంగపల్లి సరోజన, మేకల సదానందం, అసోసియేషన్‌ నాయకులు కంజపురం రాజేందర్‌, రాజేష్‌శర్మ, అనీల్‌రెడ్డి, ఆనంద్‌, తిరుపతి, అంజన్న, కిశోర్‌, వాసు పాల్గొన్నారు.
బీమా చెక్కుల పంపిణీ
ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తల కుటుంబాలకు ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పార్టీ బీమా చెక్కులను పంపిణీ చేశారు. బోదాసు రాజం, బషీర్‌ కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ బంగి అనీల్‌ కుమార్‌, నాయకులు పాతిపెల్లి ఎల్లయ్య, దీటి బాలరాజు, సలీంబేగ్‌, సిరాజుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-17T05:08:48+05:30 IST