సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

ABN , First Publish Date - 2022-08-17T05:52:11+05:30 IST

చాలీచాలని వేతనాలతో దుర్భర జీవితాలను గడుపుతున్న గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా వీఆర్‌ఏల సంఘం అధ్యక్షుడు బాందేపురపు సూరిబాబు కోరారు. మంగళవారం భీమిలి తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చిన రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్‌ అధ్యక్షుడు బొప్పరాజు వేంకటేశ్వర్లును కలిసి వినతిపత్రం అందించారు.

సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
బొప్పరాజు వేంకటేశ్వర్లుకు వినతి పత్రం అందిస్తున్న భీమిలి వీఆర్‌ఏలు

భీమునిపట్నం, ఆగస్టు 16: చాలీచాలని వేతనాలతో దుర్భర జీవితాలను గడుపుతున్న గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా వీఆర్‌ఏల సంఘం అధ్యక్షుడు బాందేపురపు సూరిబాబు కోరారు. మంగళవారం భీమిలి తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చిన రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్‌ అధ్యక్షుడు బొప్పరాజు వేంకటేశ్వర్లును కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నిత్యావసర సరకుల ధరలు పెరిగిపోతున్నా వేతనాలు పెరగకపోవడంతో  దుర్భర జీవితం గడపాల్సి వస్తోందని వాపోయారు. వీఆర్‌ఏలకు రూ.26 వేల వేతనం అందేలా ప్రభుత్వంతో చర్చించాలన్నారు. డీఏ రికవరీ జీవో ఉపసంహరించుకోవాలని, నామినీలుగా పనిచేస్తున్న వారికి పోస్టింగులివ్వాలని కలెక్టరేట్‌, ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఖాళీగా వున్న అటెండరు, నైట్‌వాచ్‌మన్‌ పోస్టులను వీఆర్‌ఏలతో భర్తీ చేసేలా చూడాలని కోరారు.  వినతిపత్రం అందించిన వారిలో సూరప్పారావు, బి.నరసింగరావు, ఎన్‌.రామప్పడు, ఆర్‌.తులిసి, సీహెచ్‌.కొండమ్మ, సీహెచ్‌.ఈశ్వరరావు, తదితరులున్నారు.

Updated Date - 2022-08-17T05:52:11+05:30 IST