పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: ఈటల

ABN , First Publish Date - 2020-08-15T09:21:42+05:30 IST

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలు భాగస్వాములై మొక్కలు నాటాలని మంత్రి ఈటల రాజేందర్‌ సూచించారు.

పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: ఈటల

రాంనగర్‌, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలు భాగస్వాములై మొక్కలు నాటాలని మంత్రి ఈటల రాజేందర్‌ సూచించారు. అడిక్‌మెట్‌ డివిజన్‌ పోచమ్మబస్తీ ప్లేగ్రౌండ్‌లో చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, కార్పొరేటర్‌ బి.హేమలతరెడ్డిలతో కలిసి మంత్రి ఈటల ప్రారంభించారు. 


కవాడిగూడ: మొక్కలు నాటడంతోపాటు వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని  రోటరీ డిస్ర్టిక్ట్‌ గవర్నర్‌ ఎన్‌వీ హనుమంతరెడ్డి తెలిపారు. శుక్రవారం ఇందిరాపార్కులో రోటరీ క్లబ్స్‌ ఆఫ్‌ ట్విన్‌ సీటీస్‌ రోటరీ డిస్ర్టిక్ట్‌ 3150కి చెందిన రోటరీ క్లబ్‌ సభ్యులు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న మొక్కల పరిరక్షణ కోసం 500 ట్రీ గాడ్స్‌ను జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ బి. శ్రీనివా్‌సరెడ్డి, ఉద్యానవన శాఖ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఇందిరాపార్కులో హరితహారంలో భాగంగా రోటరీ క్లబ్‌ సభ్యులు మొక్కలు నాటారు.


Updated Date - 2020-08-15T09:21:42+05:30 IST