అసంక్రమిక వ్యాధుల నియంత్రణకు కృషి చేయాలి

ABN , First Publish Date - 2022-05-20T05:13:23+05:30 IST

అసంక్రమిక వ్యాధుల నియంత్రణకు వైద్యసిబ్బంది కృషి చేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ చందూనాయక్‌ అన్నారు.

అసంక్రమిక వ్యాధుల నియంత్రణకు కృషి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ చందూనాయక్‌

గద్వాల క్రైం, మే 19 : అసంక్రమిక వ్యాధుల నియంత్రణకు వైద్యసిబ్బంది కృషి చేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ చందూనాయక్‌ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మట్లాడుతూ అసంక్రమిక వ్యాధుల నియంత్రణలో భాగంగా 30 ఏళ్లు పైబడి ఉండి ఘగర్‌, బీపీ  వ్యాధి గ్రస్తులను స్ర్కీనింగ్‌ చేసి ఆన్‌లైన్‌ చేయాలని ఆదేశించారు. అనుమానిత క్షయ వ్యాధి లక్షణాలు ఉన్న ప్రతీ వ్యక్తికి గళ్లపరీక్ష చేయించి, క్షయ వ్యాధి అని నిర్ధారణ అయితే చికిత్స త్వరగా అందించాలన్నారు. ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సాధారణ ప్రసవాలు ఎక్కువగా అయ్యేటట్లు, ఆశలు, ఆరోగ్య కార్యకర్తలు అవగాహన కల్పించాలన్నారు. ప్రతీ గర్భిణి 102,108 ఆంబులెన్స్‌ సేవలు ఉపయోగించుకునేట్లు వైద్యసిబ్బంది అవగాహన కల్పించాలన్నారు. ప్రతి గర్భిణికి మొదటి త్రైమాసికం నుంచే సేవలు అందించాలని, ప్రసవం అయిన వెంటనే వారికి కేసీఆర్‌ కిట్‌ అందించేలా చూడటంతో పాటు ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. పుట్టి న ప్రతీ శిశువుకు 0 డోస్‌ నుంచి వయస్సు ప్రకారం అన్ని రకాల వ్యాధి నిరోధక టీకాలు వేసి వందశాతం టార్గెట్‌ సాధించాలన్నారు. ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే వ్యక్తలకు జ్వరం, చలి, తలనొప్పి వంటి లక్షణాలు ఉంటే రక్తపరీక్షలు చేయాలని, శ్యాంపుల్స్‌ను టి-హబ్‌కు పంపించాలన్నారు. సమావేశంలో డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ శశికళ, ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ మారుతినందన్‌, ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ రామచంద్రారెడ్డి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు సురేష్‌, స్రవంతి, డీపీహెచ్‌ఎన్‌వో  వరలక్ష్మి, ఎన్‌సీడీ కో-ఆర్డినేటర్‌ శ్యాంసుందర్‌, శివన్న పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-20T05:13:23+05:30 IST