గీతకార్మికుల సంక్షేమానికి కృషి చేయాలి

ABN , First Publish Date - 2022-07-04T07:22:12+05:30 IST

రాష్ట్రంలోని గీతకార్మికుల సంక్షేమానికి ప్రభు త్వం కృషి చేయాలని తెలంగాణ గీత పనివారల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్‌ అన్నారు.

గీతకార్మికుల సంక్షేమానికి కృషి చేయాలి
చిలుకూరులో మాట్లాడుతున్న బొమ్మగాని ప్రభాకర్‌

చిలుకూరు, జూలై 3: రాష్ట్రంలోని గీతకార్మికుల సంక్షేమానికి ప్రభు త్వం కృషి చేయాలని తెలంగాణ గీత పనివారల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్‌ అన్నారు. మండల కేంద్రంలో ఆది వారం నిర్వహించిన గీతపనివారల సంఘం జిల్లా రెండో మహాసభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో గీతకార్మికుల సమస్యలు పరిష్కరించ డంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.  గీతకార్మికులకు శాశ్వత లైసెన్సు లు మంజూరు చేయాలని, జీవో నెం.560 ప్రకారం అన్ని సొసైటీలకు తాటి, ఈత వనాల పెంపకం కోసం  ప్రభుత్వం గ్రామాల్లో, పట్టణాల్లో ఐదెకరాల భూమిని కేటాయించడంతో పాటు ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేసుకునే అవకాశం కల్పించాలన్నారు. లేనట్లయితే సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.  ఈ సందర్భంగా గీతపనివారల సంఘం వ్యవస్థాపకుడు, మాజీ ఎంపీ బొమ్మ గాని ధర్మబిక్షం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, సంఘం రాష్ట్ర కోశాధికారి జి.నాగభూషణం, జిల్లా అధ్యక్షుడు  కొండా కోటయ్య, జిల్లా కార్యదర్శి లింగయ్య, పాలకూరి బాబు, బొమ్మగాని శ్రీనివాస్‌, శం కర్‌, మండవ వెంకటేశ్వర్లు, వట్టికూటి గురవయ్య,  పాల్గొన్నారు.

 జిల్లా కార్యవర్గం ఎన్నిక 

  ఈ సందర్భంగా  జిల్లా గీత  పనివారుల సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రేగట్టి లింగయ్య, ప్రధాన కార్య దర్శిగా కొండా కోటయ్య, గౌరవ అధ్యక్షుడిగా బొమ్మగాని శ్రీనివాస్‌, ఉపాధ్యక్షులుగా బంగారు లక్ష్మయ్య, బొడ్డు రామచంద్రయ్య, పాలకూరి బాబు, సహాయ కార్యదర్శులుగా లక్ష్మయ్య, ప్రభాకర్‌, బూర వెంకటేశ్వర్లు, వట్టికూటి గురవయ్య, బూర ఆంజనేయులును ఎన్నుకున్నారు.




Updated Date - 2022-07-04T07:22:12+05:30 IST