ఆలయ అభివృద్ధికి కృషి చేయాలి

ABN , First Publish Date - 2022-01-28T04:15:01+05:30 IST

చెన్నకేశవస్వామి ఆలయ అభివృద్ధికి నూతన పాలక మండలి అందరి సహకారంతో కృషి చేయాలని మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేలు కుందురు నాగార్జునరెడ్డి, అన్నా వెంక టరాంబాబులు అన్నారు.

ఆలయ అభివృద్ధికి కృషి చేయాలి
ప్రమాణస్వీకారం చేయిస్తున్న ఎమ్మెల్యేలు కుందురు, రాంబాబు


ఎమ్మెల్యేలు నాగార్జునరెడ్డి, అన్నా రాంబాబు 

అట్టహాసంగా చెన్నయ్య ఆలయ 

పాలక మండలి ప్రమాణ స్వీకారం

మార్కాపురం(వన్‌టౌన్‌), జనవరి 27: చెన్నకేశవస్వామి ఆలయ అభివృద్ధికి నూతన పాలక మండలి అందరి సహకారంతో కృషి చేయాలని మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేలు కుందురు నాగార్జునరెడ్డి, అన్నా వెంక టరాంబాబులు అన్నారు. స్థానిక శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో గురువారం ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు మాట్లాడుతూ చెన్న కేశవస్వామి ఆలయాన్ని గతంలో పని చేసిన చైర్మన్లు బాధ్యతగా పనిచేసి ఆలయాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేశారని ఈ ప్రాంతంలో దాతలకు కొదవ లేదన్నారు. అనంతరం నూతన పాలక మండలితో ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ అధ్యక్షుడిగా పెనుగొండ కేశవరావు, ధర్మకర్తలుగా పెరుమాళ్ల కాశీ సురేష్‌ బాబు, రావిపాటి మల్లేశ్వరి, ఉప్పలపాటి శ్రావణి, నాలి కొండయ్య యాదవ్‌, బత్తుల భూదేవి, బొడ్డుచర్ల సుజాత, తిప్పనబోయిన తిరుపత య్య, కురాటి మహాలక్ష్మీ ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా ప్రధాన అర్చకులు శ్రీపతి అప్పనచార్యులు ప్రమాణ స్వీకారం చేశారు.  కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, ఏ ఎంసీ చైర్మన్‌ గుంటక కృష్ణవేణి సుబ్బారెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు షేక్‌ ఇస్మాయిల్‌, అంజమ్మ, వాల్మీకి కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ నల్లబోతుల కొం డయ్య, పొదిలి ఏఎంసీ చైర్మన్‌ కోటేశ్వరరావు, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కో శాధికారి పెరుమాళ్ల కాశీరావు, ఆర్యవైశ్య సత్రం అధ్యక్షుడు దేవకి వెంక టే శ్వర్లు, శ్రావణి స్వచ్ఛంద సంస్థ చైర్మన్‌ చెప్పల్లి కనకదుర్గ  పాల్గొన్నారు.

 

Updated Date - 2022-01-28T04:15:01+05:30 IST