పెద్దగట్టు ఆలయ అభివృద్ధికి కృషిచేయాలి : మంత్రి

ABN , First Publish Date - 2021-05-14T07:22:51+05:30 IST

దురాజ్‌పల్లి పెద్దగట్టు ఆలయ అభివృద్ధికి ధర్మకర్తల మండలి పాటుపడాలని మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి కోరారు.

పెద్దగట్టు ఆలయ అభివృద్ధికి కృషిచేయాలి : మంత్రి
పెద్దగట్టు ఆలయ ధర్మకర్తల మండలిని అభినందిస్తున్న మంత్రి జగదీష్‌రెడ్డి

చివ్వెంల, మే 13: దురాజ్‌పల్లి పెద్దగట్టు ఆలయ అభివృద్ధికి ధర్మకర్తల మండలి పాటుపడాలని మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి కోరారు. జిల్లాకేంద్రం సమీపంలోని దురాజ్‌పల్లి పెద్దగట్టు లింగమంతులస్వామి ఆలయ ధర్మకర్తల మండల సభ్యుల ప్రమాణస్వీకారానికి గురువారం హాజరై వారిని అభినందించి మాట్లాడారు. గత ప్ర భుత్వాల హయాంలో నిరాధారణకు గురైన పెద్దగట్టు ఆలయాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కోట్లాది రూపాయలతో అభివృద్ది చేసుకుని దేశవ్యాప్తంగా పెద్దగ ట్టుకు పేరుతెచ్చామని అన్నారు. దురాజ్‌పల్లి పెద్దగట్టు లింగమంతులస్వామి ధర్మకర్తల పాలకమండలి చైర్మనగా ఎంపికైన సూర్యాపేట పట్టణానికి చెందిన కోడి సైదులు యాదవ్‌, సభ్యులుగా చివ్వెంల మండల పరిధిలోని గుంపుల గ్రామానికి చెందిన పచ్చిపాల అనిల్‌యాదవ్‌, తిమ్మాపురం గ్రామానికి చెందిన జటంగి నాగరాజు యా దవ్‌, దురాజ్‌పల్లికి చెందిన నల్లబోతుల నాగరాజుయాదవ్‌, పెనపహాడ్‌ మండ లం చీదేళ్ల గ్రామానికి చెందిన ఆవుల అంజయ్య, సూర్యాపేట మండలం కేసారం గ్రా మానికి చెందిన మెంతబోయిన సింహద్రియాదవ్‌, సూర్యాపేట జిల్లాకేంద్రం సీతా రాంపురానికి చెందిన పిడమర్తి జయలక్ష్మి, అక్స్‌ఫిషియో సభ్యుడిగా  ఎంపికైన మెం తబోయిన వెంకన్న ప్రమాణ స్వీకారం చేశారు.

Updated Date - 2021-05-14T07:22:51+05:30 IST