కాపు, బలిజల సంక్షేమానికి కృషి

ABN , First Publish Date - 2021-06-20T04:53:16+05:30 IST

జిల్లాలో కాపు, బలిజల సం క్షేమానికి కృషి చేస్తామని జిల్లా కాపు యువసేన అధ్యక్షుడు అల్లం చంద్రశేఖర్‌ పేర్కొన్నారు.

కాపు, బలిజల సంక్షేమానికి కృషి
ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతున్న అల్లం చంద్రశేఖర్‌

ప్రొద్దుటూరు టౌన్‌, జూన్‌ 19: జిల్లాలో కాపు, బలిజల సం క్షేమానికి కృషి చేస్తామని జిల్లా కాపు యువసేన అధ్యక్షుడు అల్లం చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. ఆయన కాపు యు వసేన రాష్ట్ర సలహాదారుడుగా నియమితులైన సందర్భం గా శనివారం ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ బలిజ, కాపులకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకునేలా కృషి చేస్తానన్నారని, జిల్లాలో బలిజ సామాజిక వర్గంవారికి అందుబాటులో ఉంటానని, ఎప్పుడైనా వారు తనను సంప్రదించవచ్చునని తెలిపారు.  ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో కాపు కమ్యూనిటీ సెలక్టింగ్‌ స్టీరిం గ్‌ కమిటీ సభ్యునిగా పనిచేశానన్నారు. కాపులను బీసీ జాబితాలో చేర్చాలని ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద జరిగిన ధర్నాలో పాల్గొన్నానన్నారు. తనను రాష్ట్ర సలహాదారునిగా నియమించిన రాష్ట్ర కాపు యువసేన అధ్యక్షుడు జిలకర మురళీనాయక్‌, ప్రధాన కార్యదర్శి కొమ్మా వాసు, కన్వీనర్‌ ఎం.తిరుమలరావు, సాయికిశోర్‌ సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిడుగు రవి, వెంకటేష్‌, బాలవీరయ్య, పవన్‌, నరే్‌షకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-06-20T04:53:16+05:30 IST