నాంచారమ్మ ఆలయ అభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2022-05-17T06:31:43+05:30 IST

నాంచారమ్మతల్లికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక దేవాలయం అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తోందని మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ అన్నారు.

నాంచారమ్మ ఆలయ అభివృద్ధికి కృషి
పిలాయిపల్లిలో ఎరుకల నాంచారమ్మ జాతర సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

వైభవంగా ఎరుకల నాంచారమ్మ జాతర


భూదాన్‌పోచంపల్లి, మే 16: నాంచారమ్మతల్లికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక దేవాలయం అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తోందని మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ అన్నారు. మండలంలోని పిలాయిపల్లిలో నిర్మిస్తున్న నాంచారమ్మ ఆలయం వద్ద సోమవారం నిర్వహించిన జాతరలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే నాంచారమ్మ జాతరకు ప్రభుత్వం రూ.5లక్షలు విడుదల చేసి అధికారికం గా ఉత్సవాలు నిర్వహిస్తోందన్నారు. కాగా, జాతర సందర్భంగా అమ్మవారి ఊ రేగింపు వైభవంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనా లు సమర్పించారు. ఈ సందర్భంగా వివిధ కళారూపాలు, డప్పు వాయిద్యాలు, గంగిరెద్దుల విన్యాసాలు, పోతరాజుల వేషధారణ ఆకట్టుకున్నాయి. ఉత్సవాల్లో ఎరుకల సంఘం (కుర్రు) రాష్ట్ర అధ్యక్షుడు కూతాడి రాములు, జిల్లా అధ్యక్షు డు కుతాడి సురేష్‌, వైస్‌ ఎంపీపీ పాక వెంకటేశంయాదవ్‌, భూదాన్‌పోచంపల్లి మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌ లింగస్వామి యాదవ్‌, కౌన్సిలర్‌ దేవరాయ కుమార్‌, సర్పంచ్‌ హరీ్‌షయాదవ్‌, ఎంపీటీసీ బందారపు సుమలత లక్ష్మణ్‌గౌడ్‌, తహసీల్దారు వీరాబాయి, ఎంపీడీవో ఎ.బాలశంకర్‌, ఆర్‌ఐ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-05-17T06:31:43+05:30 IST