Abn logo
Sep 26 2021 @ 02:08AM

మాలకొండ అభివృద్ధికి కృషి : మాగుంట

ఆటోను ప్రారంభిస్తున్న మాగుంట శ్రీనివాసులరెడ్డి

మాలకొండ (వలేటివారిపాలెం) సెప్టెంబరు 25 : మాలకొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి తెలిపారు. మాలకొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం మాగుంట రాఘవరెడ్డి చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఉచితంగా అందజేసిన ఎలక్రిక్టకల్‌ ఆటోను ఆయన స్థానిక శాసనభ్యుడు మానుగుంట మహీదర్‌రెడ్డితో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు సుమారు రూ 8 లక్షలతో 10 మంది భక్తులు కూర్చోవడానికి వీలుండే ఎలక్ర్టికల్‌ ఆటోను ఆలయానికి కానుకగా అందజేసినట్లు తెలిపారు. తమ కుటుంబం లక్ష్మినరసింహస్వామిని ఆరాధిస్తారన్నారు. భక్తులకు అన్నప్రసాదాన్ని శుచిగా అందించడంలో ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి కృషిని అభినందించారు.  ఎంపీ శ్రీనివాసులు రెడ్డి భక్తులకు స్వయంగా అన్నం వడ్డించారు. అనంతరం విశేష పూజలు చేశారు. కార్యక్రమంలో రాఘవరెడ్డి ట్రస్‌ కార్యనిర్వాహక కార్యదర్శి కే.బీ. శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు చింతలపూడి రవీంద్ర, పరిటాల వీరాస్వామి, అనుమోల వెంకటేశ్వర్లు, అనుమోల రాములు, చెన్నిబోయిన ఓబులుకొండయ్య, వరికూటి సంజీవ్‌రెడ్డి, డేగా వెంకటేశ్వర్లు, ఇరపని సతీష్‌, తదితరులు పాల్గొన్నారు.

మాలకొండ లక్ష్మీనరసింహస్వామిని శనివారం ప్రభుత్వ విప్‌ ఎమ్మెల్సీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు ఆళగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేందర్‌రెడ్డిలు శనివారం దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అర్చకులు గౌరి అష్టోత్తర ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శాలువా, పూలమాలతో సత్కరించారు. ప్రకృతి సోయగాల నడుమ ఆలయ దర్శనం విశేష అనుభూతిని మిగిలిస్తోందన్నారు.