హరిత గ్రామాల అభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2022-08-15T04:39:03+05:30 IST

రాష్ట్రంలో టీడీపీ అధికా రంలో ఉన్నా, లేకున్నా హరిత గ్రామాల అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తుందని టీడీపీ బాపట్ల పార్ల మెంట్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు.

హరిత  గ్రామాల అభివృద్ధికి కృషి
మొక్కలు నాటుతున్న ఎమ్మెల్యే ఏలూరి, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ

ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

చినగంజాం, ఆగస్టు 14: రాష్ట్రంలో టీడీపీ అధికా రంలో ఉన్నా, లేకున్నా హరిత గ్రామాల అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తుందని టీడీపీ బాపట్ల పార్ల మెంట్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. మండలంలోని గొనసపూడి గ్రామంలో ఆది వారం పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగం గా దాత విక్రం నారాయణ నిర్వహించిన కార్యక్రమా నికి ఏలూరి, కైకులూరు మాజీ ఎమ్మెల్యే జయమం గళం వెంకటరమణ ముఖ్య అతిఽథులుగా పాల్గొని మొక్కలు  నాటారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏ లూరి మాట్లాడుతూ గ్రీన్‌ గొనసపూడి కార్యక్రమా నికి విక్రం నారాయణ, గ్రామ సర్పంచ్‌ విక్రం దీప్తి మందుకు రావవండం అభినందనీయమని అన్నారు. సొంత నిధులు వెచ్చించి గ్రామాన్ని హరిత గ్రామం గా తయారు చేయాలని, పర్యావరణ సమతుల్యం కాపాడాలని ఆయన పూనుకోవడం అభినందనీయ మన్నారు. ముందుగా ఎమ్మెల్యే ఏలూరి గ్రామంలోని ఆంజనేయస్వామి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనందతరం స్వాతంత్య్రదినోత్సవ వజ్రోత్సవాలను పురస్కరించుకుని గ్రామంలోని ఆం జనేయస్వామి విగ్రహం వద్ద నుంచి నిర్వహించిన 150 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన కార్య క్రమంలో ఎమ్మెల్యే, గ్రామ సర్పంచ్‌, టీడీపీ నాయకు లు పాల్గొన్నారు. 


పది వేల మొక్కలు నాటడం స్ఫూర్తిదాయకం

చినగంజాం, ఆగస్టు 14: మా రుమూల గ్రామంలో పది వేల మొక్కలు నాటేందకు శ్రీకారం చుట్టడం స్ఫూర్తిదాయకమని కైక లూరు మాజీ ఎమ్మెల్మే జయమం గళ వెంకటరమణ అన్నారు. గొన సపూడి  గ్రామం నుంచి కొణికి వె ళ్లే రహదారిలో ఆదివారం  ఎమ్మె ల్యే ఏలూరి సాంబశివరావుతో కలి సి ఆయన మొక్కలు నాటారు. ఈసందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో వెంకటరమణ మా ట్లాడుతూ ప్రతి గ్రామం గొనస పూడిని ఆదర్శంగా తీసుకొని పర్యా వర ణాన్ని పరిరక్షించే బాధ్యత తీసుకోవాలని అన్నారు. గ్రామం చుట్టుపక్కల పది వేల మొక్కలు నాటి రెండు సంవత్సరాలలో అవి పెరిగే ందుకు అ న్నిరకాల చర్యలు చేపడతామని టీడీపీ నాయకుడు, పారిశ్రామికవేత్త విక్రం నారాయణ అన్నారు. గ్రా మాన్ని గ్రీన్‌, స్వచ్ఛ గ్రామంగా తయారుచేయా లన్నదే తన సంకల్సమని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్‌ విక్రం దీప్తి, టీడీపీ నాయకులు పాల్గొ న్నారు.  

Updated Date - 2022-08-15T04:39:03+05:30 IST