ప్రభుత్వ జూనియర్‌ కళాశాల అభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2022-01-22T05:45:13+05:30 IST

ధర్మపురి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల అభి వృద్ధి కోసం ప్రత్యేక కృషి చేస్తానని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు.

ప్రభుత్వ జూనియర్‌ కళాశాల అభివృద్ధికి కృషి
సమస్యలు తెలుసుకుంటున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

ధర్మపురి, జనవరి 13: ధర్మపురి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల అభి వృద్ధి కోసం ప్రత్యేక కృషి చేస్తానని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్ద శిథి లావస్థలో ఉన్న గదులను, మైదానం చదును, క్రికెట్‌ పిచ్‌ నిర్మాణ పను లను శుక్రవారం ఆయన పరిశీలించారు. కళాశాల అధ్యాపకులను పిలిచి సమస్యలు గురించి తెలుసుకున్నారు. కళాశాల, ఉన్నత పాఠశాల కోసం అదనంగా గదులు నిర్మించేందుకు నిధులు మంజూరు చేయిస్తానని ఆ యన హామీ ఇచ్చారు. మైదానం చదును పనులు త్వరగా పూర్తి చే యించాలని, చుట్టు విద్యుత్‌ స్థంభాలు వేయిస్తానని ఆయన హామీ ఇ చ్చారు. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభం అయ్యే ఎమ్మెల్యే క్రికెట్‌ కప్‌ టోర్నమెంట్‌ వరకు మైదానం వద్ద పనులు పూర్తి చేయించాలని ఆ యన అధికారులను ఆదేశించారు. అంతకు ముందు బురుదేశిపల్లె సమీ పంలో రూ 9 కోట్లు నిధులచే నిర్మించే మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి కోసం స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఆయన వెంట కరీంనగర్‌ డీసీ ఎంఎస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సంగి సత్య మ్మ, వైస్‌ చైర్మన్‌ రామయ్య, ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, జడ్పీటీసీ బత్తిని అరుణ, మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌, పీఆర్‌ ఏఈఈ ముకరం, ఏఎంసీ మాజీ చైర్మన్‌ అయ్యోరు రాజేష్‌కుమార్‌, కౌన్సిలర్లు ఒడ్నాల ఉమాలక్ష్మి -మల్లేశం, టీఆర్‌ఎస్‌ పట్టణ శాఖ అధ్యక్షులు ఆకుల రాజేష్‌ పాల్గొన్నారు. 

మృతుల కుటుంబ సభ్యులను ఆదుకుంటా

ధర్మపురి మండలంలో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన వ్యక్తుల కుటుంబ సభ్యులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని మం త్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. ధర్మపురిలో పలు కారణాలతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. ఆయన వెంట సర్పంచులు కొండపెల్లి సువర్ణ-ప్రకాష్‌రావు, కడారి చిన్ననర్సు, కౌన్సిలర్‌ కొంపల పద్మ-తిరుపతి పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-22T05:45:13+05:30 IST