Abn logo
Sep 29 2021 @ 00:44AM

డీసీఎంఎస్‌ అభివృద్ధికి కృషి

మహాజన సభలో మాట్లాడుతున్న చైర్‌పర్సన్‌ చినతల్లి

చైర్‌పర్సన్‌ చినతల్లి


అనకాపల్లి, సెప్టెంబరు 28: డీసీఎంఎస్‌ అభివృద్ధికి కృషి చేస్తానని సంస్థ చైర్‌పర్సన్‌ పల్లా చినతల్లి అన్నారు. స్థానిక డీసీఎంఎస్‌ కార్యాలయంలో మంగళవారం 45వ మహాజన సభ నిర్వహించారు. ముందుగా సంస్థ వ్యవస్థాపకుడు బొడ్డేడ అచ్చింనాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ, సంస్థకు చెందిన ఖాళీ స్థలాల్లో షాపింగ్‌ కాంప్లెక్స్‌లు నిర్మించి ఆర్థికంగా అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే పెట్రోలు బంకు నిర్మించే విషయమై సభ్యులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో బిజినెస్‌ మేనేజర్‌ ఎస్‌.ఎస్‌.ఎస్‌.చంద్రకుమార్‌, సభ్యులు పిల్లా దాసరది నరసింగరావు, గుమ్మడి సత్యదేవ్‌, మోపాడ అప్పారావు, పాండ్రంగి అప్పారావు, నంద్యాల శంకరయ్య, బంగారు అప్పలనర్సమ్మ, పీఏసీఎస్‌ల అధ్యక్షులు పాల్గొన్నారు.