సమగ్రాభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2021-01-27T05:01:48+05:30 IST

జిల్లా సమగ్రాభివృద్ధే ధ్యేయంగా ప్రతి ఒక్కరు తోడ్పాటునందిస్తున్నారని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఆమె మాట్లాడారు. స్వాతంత్య్ర ఫలాలు ప్రతీ భారతీయుడికి చేరాలనే సంకల్పంతో రాజ్యాంగం రూపకల్పన జరిగిందన్నారు.

సమగ్రాభివృద్ధికి కృషి
పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరిస్తున్న కలెక్టర్‌ అనితారామచంద్రన్‌

కరోనా నియంత్రణలో వైద్య, పోలీస్‌, పారిశుధ్య సిబ్బంది సేవలు భేష్‌

గణతంత్ర దినోత్సవంలో యాదాద్రి జిల్లా కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ 

కల్నల్‌ సంతోష్‌ బాబుకు ఘన నివాళి

యాదాద్రి, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): జిల్లా సమగ్రాభివృద్ధే ధ్యేయంగా ప్రతి ఒక్కరు తోడ్పాటునందిస్తున్నారని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఆమె మాట్లాడారు. స్వాతంత్య్ర ఫలాలు ప్రతీ భారతీయుడికి చేరాలనే సంకల్పంతో రాజ్యాంగం రూపకల్పన జరిగిందన్నారు. కరోనా నియంత్రణలో వైద్యులు, పోలీసులు, పారిశుఽధ్య సిబ్బంది చేసిన సేవలను కొనియాడారు. ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ కష్టకాలంలో బాధితులకు వెన్నంటు ఉండి ఆదుకున్న దాతలను అని అభినందించారు. చైనా సరిహద్దు గల్వాన్‌ లోయలో వీరమరణం పొందిన తెలుగు తేజం కల్నల్‌ సంతోష్‌ బాబుకు మహావీర చక్ర పురస్కారం దక్కడం గర్వకారణమన్నారు. తొలుత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, వివిధ శాఖల సిబ్బందికి కలెక్టర్‌ ప్రశంసాపత్రాలు అందజేశారు. అదేవిధంగా 17 మండలాల్లో ఒక పంచాయతీ చొప్పున ఎంపిక చేసి 17 గ్రామ పంచాయతీల సర్పంచ్‌లను ఈ సందర్భంగా సన్మానించారు. అనంతరం దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన కల్నల్‌ సంతోష్‌ బాబుకు భారత ప్రభుత్వం మహావీర చక్ర ప్రకటించిన సందర్భంగా ఆయన భార్య ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ సంతోషిని ఘనంగా సన్మానించారు. వేడుకల్లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, జడ్పీచైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, ఇన్‌చార్జి డీసీపీ పి.యాదగిరి, అదనపు కలెక్టర్లు డి.శ్రీనివా్‌సరెడ్డి, ఎన్‌.ఖీమ్యానాయక్‌, ట్రైనీ కలెక్టర్‌ గరీమా అగర్వాల్‌, డిప్యూటీ కలెక్టర్‌ సంతోషి, ఆర్డీవో ఎంవీ.భూపాల్‌రెడ్డి, జడ్పీ సీఈవో సీహెచ్‌.కృష్ణారెడ్డి, గ్రంథాలయ జిల్లా చైర్మన్‌ డాక్టర్‌ అమరేందర్‌గౌడ్‌, రైతు సమన్వయ సమితి జిల్లా, మండల కన్వీనర్‌ కొలుపుల అమరేందర్‌, కంచి మల్లయ్య, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ కుడుదుల నగేష్‌, మునిసిపల్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎనబోయిన అంజనేయులు, చింతల కిష్టయ్య, ఏఎంసీ చైర్మన్‌ రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-01-27T05:01:48+05:30 IST