వాలీబాల్‌ ఆడిటోరియం ఏర్పాటుకు కృషి

ABN , First Publish Date - 2022-10-04T05:06:41+05:30 IST

జిల్లా కేంద్రంలోని వాలీబాల్‌ క్రీడాకారులకు భవిష్యత్‌లో ఆడిటోరియం ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌ రెడ్డి అన్నారు.

వాలీబాల్‌ ఆడిటోరియం ఏర్పాటుకు కృషి
వాలీబాల్‌ టోర్నమెంట్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి

- ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి 

- ఓపెన్‌ వాలీబాల్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

గద్వాల అర్బన్‌, అక్టోబరు 3 : జిల్లా కేంద్రంలోని వాలీబాల్‌ క్రీడాకారులకు భవిష్యత్‌లో ఆడిటోరియం ఏర్పాటుకు  కృషి  చేస్తానని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌ రెడ్డి అన్నారు.  పట్టణంలోని రెండో రైల్వేగేట్‌ యూత్‌ ఆధ్వర్యంలో సో మవారం నిర్వహించిన ఓపెన్‌ వాలీబాల్‌ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నడిగడ్డ ప్రాంతా నికి చెందిన క్రీడాకారులు క్రికెట్‌, కబడ్డీ, ఫుట్‌బాల్‌ వంటి క్రీడల్లో రాష్ట్ర, జాతీ యస్థాయిలో చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శించి జిల్లాకు పేరుప్రఖ్యాతులు తీసుకొచ్చా రన్నారు. యువకులు చదువుతో పాటు క్రీడారంగంలో కూడా నైపుణ్యం సాధించా లని, క్రీడల వల్ల శారీరకంగా, మానసికంగా ఎంతో ఉపయోగపడుతుందన్నారు.  క్రీడల్లో క్రీడాకారులు గెలుపు, ఓటమిలను సమానంగా స్వీకరించాలన్నారు. అంత కుముందు ఎమ్మెల్యే వాలీబాల్‌ క్రీడాకారులను పరిచయం చేసుకుని, వారికి టీషర్ట్‌లను అందజేశారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌, జడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్‌, కౌన్సిలర్లు టి.శ్రీనుముదిరాజ్‌, మహేష్‌, ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి డాక్టర్‌ బీఎస్‌ ఆనంద్‌, టీఆర్‌ఎస్‌  నాయకలు రామకృష్ణశెట్టి, నాగులుయాదవ్‌, రిజ్వాన్‌, వీరేష్‌, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-10-04T05:06:41+05:30 IST