‘ఆపిల్‌’కు ‘ఐ ఫోన్’ దెబ్బ... గంటల్లోనే...

ABN , First Publish Date - 2020-10-30T21:51:09+05:30 IST

ఆపిల్ కొత్త 5 జీ ఫోన్ లాంచింగ్ ఆలస్యం కావడంతో కొనుగోలుదారులు వీటి కొనుగోలును పక్కన పెట్టారు. దీంతో ఆపిల్‌‍కు భారీ నష్టం సంభవించింది. గత రెండేళ్లలో మొదటిసారి సెప్టెంబర్ త్రైమాసికంలో ఆపిల్ తన అమ్మకాల్లో క్షీణతను ప్రకటించింది.

‘ఆపిల్‌’కు ‘ఐ ఫోన్’ దెబ్బ... గంటల్లోనే...

కాలిఫోర్నియా : ఆపిల్ కొత్త 5 జీ ఫోన్ లాంచింగ్ ఆలస్యం కావడంతో కొనుగోలుదారులు వీటి కొనుగోలును పక్కన పెట్టారు. దీంతో ఆపిల్‌‍కు భారీ  నష్టం సంభవించింది. గత రెండేళ్లలో మొదటిసారి సెప్టెంబర్ త్రైమాసికంలో ఆపిల్ తన అమ్మకాల్లో క్షీణతను ప్రకటించింది. ఈ క్రమంలో... కంపెనీ స్టాక్స్ 5 శాతం మేర పడిపోయాయి. అంటే ఫలితాల తర్వాత కొద్ది గంటల్లోనే ఆపిల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 100 బిలియన్ డాలర్లు (రూ.7.4 లక్షల కోట్లు) హరించుకుపోయింది. ఆదాయాలు అంచనాలను మించినప్పటికీ అమ్మకాలు మాత్రం భారీగా తగ్గాయి. గురువారం స్టాక్స్  నష్టపోయినప్పటికీ శుక్రవారం మాత్రం మూడు శాతానికి పైగా పుంజుకున్నాయి.



ప్రతీ ఏటా కొత్త మోడల్...
2013 నుండి ఆపిల్ ప్రతీ ఏడాదీ సెప్టెంబరు నెలలో ఓ కొత్త మోడల్ ఐఫోన్‌ను లాంచ్ చేస్తూ వస్తోంది. ఇదే క్రమంలోఈ సారి కూడా 5జీ ఐఫోన్‌ను సెప్టెంబరులో మార్కెట్ లోకి తీసుకు వస్తుందని అదరూ భావించారు. అయితే కరోనా నేపధ్యంలో ఈ ప్రక్రియ ఆలస్యమైంది. దీనిని అక్టోబరు లో మార్కెట్ లోకి విడుదల చేసింది. దీంతో సెప్టెంబరు త్రైమాసిక ఫలితాలపై ఈ ప్రభావం భారీగా పడింది. సెప్టెంబరు ‍లో ఫోన్ వస్తుందని భావించి వినియోగదారులు, కొనుగోలుదారులు ఎదురుచూపులు చూశారు. కొనుగోళ్లను వాయిదా వేశారు. ఆపిల్ కూడా అక్టోబరులో విడుదల చేయడంతో వినియోగదారులు మరికొద్ది రోజులు వేచి చూడాల్సి వ,చ్చింది. దీంతో విక్రయాలు 20.7 శాతం మేరకు క్షీణించి 26.4 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.

అయినా భారీ లాభాలు...
ఆపిల్‌కు చెందిన మాక్, ఎయిర్‌పాడ్స్ విక్రయాలు మాత్రం పెరిగాయ. దీంతో ఆదాయం, లాభాల్లో వృద్ధిని నమోదు చేసింది. సెప్టెంబరు త్రైమాసికంలో 64.7 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఇది ఒకశాతం ఎక్కువ. విశ్లేషకుల అంచనాలకు మించి ఒక్కో షేరుపై మంచి ఆదాయం వచ్చింది. అయితే ఐఫోన్ సమయానికి రాకపోవడంతో ఈ విభాగంలో మాత్రం విక్రయాలు పడిపోయాయి.

Updated Date - 2020-10-30T21:51:09+05:30 IST