నిమ్స్‌లో కోబాస్ 8800 యంత్రాన్ని ప్రారంభించిన ఈటల

ABN , First Publish Date - 2020-09-25T19:16:25+05:30 IST

హైదరాబాద్: నిమ్స్‌లో కోబాస్ 8800 యంత్రాన్ని మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.

నిమ్స్‌లో కోబాస్ 8800 యంత్రాన్ని ప్రారంభించిన ఈటల

హైదరాబాద్: నిమ్స్‌లో కోబాస్ 8800 యంత్రాన్ని మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్యంలో ఇన్ఫ్రా స్ట్రక్చర్ అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఉన్నామన్నారు. ఇప్పటికే అనేక రకాల పరికరాలను సమకూర్చామన్నారు. నిమ్స్ చాలా పేరున్న ఆస్పత్రి అని పేర్కొన్నారు.పేదలకు అందుబాటులో ఉన్న ఏకైక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇదేనన్నారు. ఆర్‌టీపీసీఆర్ టెస్టులు రోజుకి 4000 వరకు చేయవచ్చన్నారు. రాష్ట్రంలో రోజుకు 20 వేల ఆర్‌‌టీపీసీఆర్ టెస్ట్లు చేసే సామర్ధ్యం ఉందని ఈటల తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలో పని చేసిన ప్రతి వ్యక్తిని ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. గతంతో పోలిస్తే టెస్టులలో పాజిటివ్ రేట్ భారీగా తగ్గిందన్నారు. 

Updated Date - 2020-09-25T19:16:25+05:30 IST