తెలంగాణలో పీకే సర్వేలు పని చేయవు: ఈటెల

ABN , First Publish Date - 2022-06-16T00:01:35+05:30 IST

Medak: తెలంగాణలో ఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యుహాలు, సర్వేలు పని చేయవని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన

తెలంగాణలో పీకే సర్వేలు పని చేయవు: ఈటెల

Medak: తెలంగాణలో ఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యుహాలు, సర్వేలు పని చేయవని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టీఆర్ఎస్‌ను ప్రజలు ఇంటికి సాగనంపడం ఖాయమన్నారు. ఇక తాను గెలువలెననే భయంతో  కేసీఆర్ పీకేను ఆశ్రయించాడని తెలిపారు. కేసీఆర్ వద్ద పీకే  స్వచ్చందంగా పని చేయడం లేదని, రూ. 600 కోట్ల‌కు ఒప్పందం కుదుర్చుకుని పనిచేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ ఎనిమిదేళ్ల ప్రజా సంక్షేమ పాలనపై  మెదక్‌లో ఏర్పాటుచేసిన సదస్సులో ఈటెల మాట్లాడారు.


ఇంకా ఏమన్నారంటే...

‘‘గతంలో దేశంలో ఎక్కడపడితే అక్కడ కుంభకోణాలు జరిగాయి. ఎనిమిదేండ్ల మోడీ పాలనలో ఎక్కడనైనా కుంభకోణాలు జరిగాయా? కరోనా కష్టకాలంలో దేశాన్ని కాపాడిన వ్యక్తి ప్రధాని మోదీ. కేసీఆర్ అంటే ప్రజలకు అసహ్యం వేస్తుంది. రైతులకు ఏకకాలంలో రూ.లక్ష రుణమాఫీ చేస్తామని మోసం చేసిండు. తెలంగాణలో ఉన్న ఒక్కో వ్యక్తిపై రూ 1.25 లక్షల అప్పు ఉంది..కాదని చెప్పమనండి.. నేను చర్చకు సిద్ధం. రాష్ట్రంలో ధరలు విపరీతంగా పెరిగి పోతున్నాయి.. మరోవైపు పన్నులు పెంచుతున్నాడు. నష్టపరిహారం ఇవ్వమన్నగౌరవేల్లి రైతులపై లాఠీచార్జి చేయించారు. తెలంగాణలో కాంగ్రెస్ విశ్వసనీయత కోల్పోయింది. తెలంగాణ గడ్డపై కష్టపడితే బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం’’.

Updated Date - 2022-06-16T00:01:35+05:30 IST