Abn logo
Jul 30 2021 @ 22:11PM

ఇంటికి వెళ్లిన ఈటెల రాజేందర్

కరీంనగర్: స్వల్ప అస్వస్థతకు గురై నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ ఆసుపత్రి నుంచి హుజురాబాద్‌లోని ఇంటికి వెళ్లాడు. ఈటలకు చికిత్స అందించడానికి వరంగల్ నుంచి వచ్చిన డాక్టర్ కాళీ ప్రసాద్ వచ్చారు. ఈటెల హెల్త్ కండిషన్‌ను పరిశీలించారు. హైదరాబాద్‌లో చికిత్స కోసం వద్దని ఈటెల అన్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతానికి ఈటెల రాజేందర్ హుజురాబాద్‌లోని ఇంటికి వెళ్లాడు.  మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ స్వల్ప అస్వస్థతకు గురయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి ఆయనను తరలించారు. బీపీ పడిపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్తున్నామని వైద్యులు తెలిపారు. దీంతో ప్రజాదీవెన పాదయాత్రకు ఈటల విరామం ప్రకటించే అవకాశం ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు.