Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jun 16 2021 @ 18:20PM

బీజేపీలో చేరటం గర్వంగా ఫీలవుతున్నా: ఈటల రాజేందర్‌

హైదరాబాద్: తాను బీజేపీలో చేరటాన్ని గర్వంగా ఫీలవుతున్నానని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఉద్యమంలో తాము లేకుంటే కెప్టెన్ ఎక్కడుండేవాడని పరోక్షంగా కేసీఆర్‌ను ఉద్దేశించి ఈటల ప్రశ్నించారు. ఆదేశాలను తాము సమర్థవంతంగా అమలు చేయకపోతే పేరు, గుర్తింపు కెప్టెన్‌కు వచ్చేవి కావని ఈటల అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ పాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఈటల విమర్శించారు. కొత్త రాష్ట్రంలో ఇన్ని బాధలు ఉంటాయని తెలంగాణ సమాజం ఊహించి ఉండదని ఆయన అన్నారు. 

తన డీఎన్‌ఏను పక్కన పెడితే మరో ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధం కావాలని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉద్యమంలో ప్రజల కాళ్ల మధ్యలో తిరిగిన వ్యక్తిని తానని ఈటల పేర్కొన్నారు. సుష్మా స్వరాజ్, విద్యాసాగరరావు లాంటి నేతలతో కలిసి ఉద్యమంలో తాను పనిచేశానని ఆయన వివరించారు. చరిత్ర మొదలు కావటానికి ఏదొక పార్టీ తోడు ఉండాలి కాబట్టే టీఆర్ఎస్‌లో పనిచేశానని ఈటల రాజేందర్‌ తెలిపారు. 

Advertisement
Advertisement