జేఈఈ మెయిన్ పరీక్షలు మార్చికి వాయిదా..?

ABN , First Publish Date - 2022-01-01T23:31:11+05:30 IST

జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌ అయిన జేఈఈ మెయిన్-2022 పరీక్షలు ..

జేఈఈ మెయిన్ పరీక్షలు మార్చికి వాయిదా..?

న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌ అయిన జేఈఈ మెయిన్-2022 పరీక్షలు ఫిబ్రవరి నుంచి మార్చికి వాయిదా పడే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడవచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కోవిడ్ మహమ్మారి కారణంగా గత ఏడాది నాలుగు విడతలు పరీక్షలు నిర్వహించిన తరహాలోనే జేఈఈ-2022  పరీక్షలను కూడా మార్చి, ఏప్రిల్, మే, జూన్‌లలో నిర్వహిస్తారని, తేదీలను త్వరలోనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటిస్తుందని ఆ వర్గాలు చెప్పాయి.


గత ఏడాది తరహాలోనే నాలుగు సెషన్ల జేఈఈ మెయిన్ ఎంట్రన్స్ పరీక్షలను నిర్వహించాలని ఇప్పటికే పలువురు ఇంజనీరింగ్ యాస్పిరెంట్లు డిమాండ్ చేస్తున్నారు. ఈసారి జేఈఈ మెయిన్‌కు సంబంధించి ఈసారి మరిన్ని వెసులుబాట్లను ఎన్‌టీఏ కలిపించవచ్చని చెబుతున్నారు. పరీక్షల్లో విద్యార్థుల ఇంటర్నల్ చాయెసెస్‌‌కు అవకాశం ఉండొచ్చని అంటున్నారు. గత ఏడాదిలాగే తమకు నాలుగు విడతల (ఫోర్ అటమ్ట్) ప్రొవిజన్ కల్పించాలని పలు కాలేజీల విద్యార్థుల డిమాండ్‌గా ఉంది. గత ఏడాది తాము కొన్ని సమస్యలు ఎదుర్కొన్నందునన ఈసారి పరీక్షల్లో కూడా ఈ వెసులుబాటు ఉండాలని సోషల్ మీడియా పోస్టుల్లో విద్యార్థులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-01-01T23:31:11+05:30 IST