Abn logo
May 21 2020 @ 19:31PM

‘ఈ కథలో పాత్రలు కల్పితం’ థీమ్ పోస్టర్ వదిలారు

పవన్‌ తేజ్‌ కొణిదెలను హీరోగా పరిచయం చేస్తూ మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అభిరామ్‌ ఎం. దర్శకత్వంలో.. రాజేష్‌ నాయుడు నిర్మిస్తున్న థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. మేఘన, ల‌క్కీ హీరోయిన్స్‌. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ పోస్టర్స్‌కి మంచి స్పందన వచ్చిందని తెలిపిన చిత్రయూనిట్ తాజాగా చిత్ర థీమ్ పోస్టర్‌ను విడుదల చేసింది.


ఈ సందర్భంగా నిర్మాత రాజేష్‌ నాయుడు మాట్లాడుతూ.. ‘‘ఈ కథలో పాత్రలు కల్పితం.. చిత్ర షూటింగ్ దాదాపు పూర్తయింది. మేము అనుకున్న ప్రణాళిక ప్రకారం సజావుగానే షూటింగ్ పూర్తి చేశాము. లాక్‌డౌన్ కారణంగా ఇంకో షెడ్యూల్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆగిపోయింది. సినిమాకి ఆర్టిస్టులు, టెక్నిషీయన్స్ మంచి సపోర్ట్ అందించారు. ఇప్పటివరకు చిత్రీకరించిన వరకు ఔట్‌ఫుట్ చాలా బాగా వచ్చింది. టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి మా సినిమాకి పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. మా హీరో పవన్‌ తేజ్‌ కొణిదెలకి ఒక పర్ఫెక్ట్ లాంచింగ్ మూవీ అవుతుంది. మా దర్శకుడు అభిరామ్ మంచి విజన్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టునే థ్రిల్లింగ్ అంశాలతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘జెస్సీ’, రీసెంట్‌గా వచ్చిన ‘ఓ పిట్టకథ’ సినిమాలకి వర్క్ చేసిన సినిమాటోగ్రాఫర్‌ సునీల్‌ కుమార్‌ విజువల్స్‌, ‘ఆర్‌ఎక్స్‌ 100’, ‘కల్కి’ చిత్రాలకు డైలాగ్స్‌ రాసిన తాజుద్దీన్‌ సయ్యద్‌ మాటలు ఈ చిత్రానికి హైలెట్‌గా నిలవనున్నాయి. చివరి షెడ్యూల్ పూర్తి అవగానే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరిపి విడుదల తేదీని ప్రకటిస్తాం. త్వరలోనే టీజర్, పాటలు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. తాజాగా విడుదలైన థీమ్ పోస్టర్‌కు మంచి ఆదరణ లభిస్తోంది..’’ అని తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement