రైతు బిడ్డలకు విద్యారుణాలు

ABN , First Publish Date - 2020-06-06T09:49:31+05:30 IST

సహకార బ్యాంకుల ద్వారా రైతుబిడ్డలకు విదేశాలు వెళ్ళేందుకు విద్యా రుణాలు పెద్దఎత్తున మంజూరు చేస్తున్నట్లు డీసీసీబీ చైర్మన్‌ గొంగడి మహేందర్‌రెడ్డి

రైతు బిడ్డలకు విద్యారుణాలు

ఉమ్మడి జిల్లాలో రూ.60 కోట్లు పంపిణీ  : డీసీసీబీ చైర్మన్‌ 


హుజూర్‌నగర్‌, జూన్‌ 5 : సహకార బ్యాంకుల ద్వారా రైతుబిడ్డలకు విదేశాలు వెళ్ళేందుకు విద్యా రుణాలు పెద్దఎత్తున మంజూరు చేస్తున్నట్లు డీసీసీబీ చైర్మన్‌ గొంగడి మహేందర్‌రెడ్డి తెలిపారు.హుజూర్‌నగర్‌లో నియోజకవర్గంలోని 16 సహకార సంఘాల ద్వారా రైతులకు మంజూరైన రూ.8 కోట్ల కోవిడ్‌-19 రుణాలను శుక్రవారం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని సహకార సంఘాలకు రూ.60కోట్ల కోవిడ్‌-19 రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు.


రూ.25వేల లోపు రుణాలు ఒకే విడతలో రుణమాఫీ చేస్తున్నామన్నారు. సుమారు. 33,653 మంది రైతులకు ఈ విధంగా రూ.100 కోట్ల రుణాల మాఫీకి నిధులు విడుదల చేసినట్లు తెలిపారు.డీసీసీబీ పరిధిలో మొత్తంగా రూ.316.81 కోట్ల రుణాలు మాఫీ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో డీసీసీబీ రూ.10 కోట్ల లాభాల్లో ఉందన్నారు. ఫౌల్ర్టీ రంగానికి రూ.కోటీ 13 లక్షల సబ్సిడీ ఇచ్చామన్నారు. సహకార సంఘాల పాలకవర్గం రైతులకు దగ్గరగా పనిచేయాలని ఎమ్మెల్యే శానంపూడి సైది    రెడ్డి కోరారు. సహకార సంఘాలన్నింటినీ లాభాల బాటలో పయనించేలా చేయాలన్నారు.


కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్లు వేములూరి రంగాచారి, అప్పిరెడ్డి, దొంగరి వెంకటేశ్వర్లు, ఎంపీపీ గూడెపు శ్రీనివాసు, జడ్‌పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, సీఈవో మదన్‌మోహన్‌, మేనేజర్‌ సుధాకర్‌,  గెల్లి రవి, జక్కుల నాగేశ్వరరావు, గోపాల్‌రావు, శౌరిరెడ్డి, రాధాకృష్ణ, పార్వతి, కొండానాయక్‌, శ్రీలతారెడ్డి, కొండారెడ్డి, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-06T09:49:31+05:30 IST