విద్యా సెలవులు రద్దు చేయాలి

ABN , First Publish Date - 2022-01-20T06:14:36+05:30 IST

విద్యా సంస్థల సెలవులు వెంటనే రద్దు చేసి, పాఠశాలలు, కళాశాలలు తెరవాలని డిమాండ్‌ చేస్తూ స్వేరో స్టూడెంటు యూనియన్‌ ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని పాటిమట్ల గ్రామంలో విద్యార్థులు ఫ్లకార్డులతో బుధవారం నిరసన తెలిపారు. స్వేరో స్టూడెంట్‌ యూనియన్‌ మండల అధ్యక్షుడు కుర్మేటి నవీన్‌ మాట్లాడుతూ బార్లు, షాపింగ్‌ మాల్స్‌, సినిమా థియే

విద్యా సెలవులు రద్దు చేయాలి
మోత్కురులో ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న విద్యార్థులు

మోత్కూరు, జనవరి 19: విద్యా సంస్థల సెలవులు వెంటనే రద్దు చేసి, పాఠశాలలు, కళాశాలలు తెరవాలని డిమాండ్‌ చేస్తూ స్వేరో స్టూడెంటు యూనియన్‌ ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని పాటిమట్ల గ్రామంలో విద్యార్థులు ఫ్లకార్డులతో బుధవారం నిరసన తెలిపారు. స్వేరో స్టూడెంట్‌ యూనియన్‌ మండల అధ్యక్షుడు కుర్మేటి నవీన్‌ మాట్లాడుతూ బార్లు, షాపింగ్‌ మాల్స్‌, సినిమా థియేటర్లకు రాని కరోనా విద్యాసంస్థలకే వస్తుందా అని ప్రశ్నించారు. సెలవుల పొడిగింపు కారణంగా బడుగు, బలహీన వర్గాల పిల్లలు విద్యకు దూరమవుతున్నారన్నారు. కార్యక్రమంలో అంబాల జీవన్‌, కుర్మేటి నరేందర్‌, నవీన్‌, సిదేశ్‌, మనిషా, శ్రీనిత్య తదితరులు పాల్గొన్నారు.

మాకు విద్యను దూరం చేయొద్దు

అడ్డగూడూరు: పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్యను దూరం చేయొద్దని, వెంటనే పాఠశాలలు తెరవాలని డిమాండ్‌ చేస్తూ మండల కేంద్రంలోని అంబేద్కర్‌ విగ్రహం ఎదుట విద్యార్థులు, తల్లిదండ్రులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. కరోనా సాకుతో పాఠశాలలు మూసివేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేయాలని సీఎం కేసీఆర్‌ కుట్రపన్నారని అడ్డగూడూరు సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల మాజీ పేరెంట్స్‌ కమిటీ వైస్‌ చైర్మెన్‌ బాలెంల సురేష్‌ ఆరోపించారు. కార్యక్రమంలో ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా సహాయ కార్యదర్శి బుర్రు అనిల్‌కుమార్‌, బాలెంల మహేష్‌, గూడెపు గోపి, బోడ సాయి, రాకేష్‌, చింటూ, బన్నీ, పేరెంట్స్‌ బోడ యాదగిరి, బాలెంల సర్సయ్య, నాగులపల్లి సోమయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-20T06:14:36+05:30 IST