విద్యాసంస్థ‌ల ప్రారంభంపై స‌ర్కార్ మ‌ల్ల‌గుల్లాలు

ABN , First Publish Date - 2021-08-19T00:05:03+05:30 IST

తెలంగాణాలో విద్యాసంస్థ‌ల ప్రారంభంపై స‌ర్కార్ మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. దేశంలో చాలా రాష్ట్రాలు క‌రోనా నిభంద‌న‌ల‌కు అనుకూలంగా ఏర్పాటు చేస్తూ

విద్యాసంస్థ‌ల ప్రారంభంపై స‌ర్కార్ మ‌ల్ల‌గుల్లాలు

హైదరాబాద్: తెలంగాణాలో విద్యాసంస్థ‌ల ప్రారంభంపై స‌ర్కార్ మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. దేశంలో చాలా రాష్ట్రాలు క‌రోనా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేస్తూ ప్ర‌త్య‌క్ష బోధన ప్రారంభించారు. ఇక్క‌డ మాత్రం పాఠ‌శాల‌ల‌ను తెరిచేందుకు స‌ర్కార్ వెన‌క‌డుగు వేస్తోంది. ఇప్ప‌టికే మూడు సార్లు స్కూళ్లు తెరిచేందుకు అనుమ‌తి ఇవ్వాలంటూ విద్యాశాఖ సీఎంఓకు ప్ర‌తిపాద‌న‌లు పంపింది. సీఎం అనుమ‌తి కోసం ఫైల్ పంపించి దాదాపు 10రోజులు అవుతోంది. సెప్టెంబ‌ర్ 1నుంచి హైస్కూల్‌తో పాటూ ఇంట‌ర్, డిగ్రీ ఇంజ‌నీరింగ్‌లో ప్ర‌త్య‌క్ష బోధన‌కు విద్యాశాఖ అన్ని ఏర్పాట్ల‌ు చేసింది. అయితే స్కూళ్ల‌ను ఎప్ప‌టినుంచి ప్రారంభించాల‌నే అంశంపై ప్రభుత్వం త‌ర్జ‌న భర్జ‌న పడుతున్న‌ట్లు స‌మాచారం.

Updated Date - 2021-08-19T00:05:03+05:30 IST