విద్యా సంఘాల పాదయాత్ర

ABN , First Publish Date - 2020-09-30T05:57:49+05:30 IST

ప్రైవేటు యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ శ్రీరాంపూర్‌లోని ఆర్కే6 కొత్తరోడ్డు నుంచి మహాజన

విద్యా సంఘాల పాదయాత్ర

శ్రీరాంపూర్‌, సెప్టెంబరు 29: ప్రైవేటు యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని  డిమాండ్‌ చేస్తూ శ్రీరాంపూర్‌లోని ఆర్కే6 కొత్తరోడ్డు నుంచి మహాజన స్టూడెంట్‌ యూనియన్‌, మాదిగ విద్యార్థి ఫెడరేషన్‌ల ఆధ్వర్యంలో మంగళవారం పాద యాత్ర చేపట్టారు.  ఈ సందర్భంగా సింగరేణి కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మంతెన మల్లేష్‌, ఎమ్మార్పీఎస్‌ జాతీయ సభ్యుడు రేగుంట కేశవ్‌ మాదిగ మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదలకు విద్యను దూరం చేసే యత్నం చేస్తోందన్నారు.


ఇందులో భాగంగా ప్రైవేట్‌ యూనివర్సిటీలలో రిజర్వేషన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లేకుండా చేసిందన్నారు. ప్రైవేటు యూనివర్సిటీలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.  కార్యక్రమంలో ఎంఎస్‌యూ నియోజకవర్గ ఇన్‌చార్జి సుందిల్ల మల్లేష్‌, రాష్ట్ర నాయకులు జూపాక సాయి మాదిగ, గద్దల బానయ్య, జలంపెల్లి సుదర్శన్‌, ఎంఎస్‌ఎఫ్‌, ఎంఎస్‌యూ జిల్లా నాయకులు ప్రశాంత్‌, చెన్నూరి నితిన్‌, జలంపల్లి ప్రవీణ్‌, కాదాసి రవీందర్‌, బొనాస స్వామి, మొగిలి చంద్రయ్య, రేగుంట మహేష్‌, పోశన్న తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-30T05:57:49+05:30 IST