విద్య వ్యాపార విధానాలపై పోరాడాలి

ABN , First Publish Date - 2022-08-13T06:13:16+05:30 IST

విద్యను వ్యాపారంగా మారుస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటానికి సిద్ధంకావాలని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్‌బాబు పిలుపు నిచ్చారు.

విద్య వ్యాపార విధానాలపై పోరాడాలి
ఎంవీపీలోని బాలికల వసతిగృహంలో ఏఐఎస్‌ఎఫ్‌ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్‌బాబు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొందూ దొందే

ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్‌బాబు పిలుపు

విశాఖపట్నం, ఆగస్టు 12: విద్యను వ్యాపారంగా మారుస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటానికి సిద్ధంకావాలని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్‌బాబు పిలుపు నిచ్చారు. ఏఐఎస్‌ఎఫ్‌ 87వ ఆవిర్భావ దినోత్సవం శుక్రవారం ఎంవీపీ కాలనీలోని బాలికల వసతి గృహంలో ఘనంగా జరిగాయి. జాన్సన్‌బాబు ఏఐఎస్‌ఎఫ్‌ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగిస్తూ స్వాతంత్రోద్యమంలో దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసి ఉద్యమాన్ని నిర్మించిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్‌ఎఫ్‌ అన్నారు.


దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్‌సింగ్‌, సుఖదేవ్‌, రాజ్‌గురుల స్ఫూర్తితో సంఘం, అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే స్ఫూర్తితో పనిచేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ నేతలు నాగభూషణం, యు.నాగరాజు, జి.ఫణింద్ర కుమార్‌, నాయడు, బాలాజీ, వంశీకృష్ణ, దేవి, భారతి, భాగ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-13T06:13:16+05:30 IST