Cbse విద్యార్థులకు అవకాశం

ABN , First Publish Date - 2022-06-23T16:11:46+05:30 IST

ఇంజనీరింగ్‌, ఆర్ట్స్‌ , సైన్స్‌, పాలిటెక్కిక్‌ కోర్సుల్లో సీబీఎస్ఈ విద్యార్థులు చేరేందుకు దరఖాస్తు చేసేందుకు మరో ఐదు రోజులు అవకాశం కల్పిస్తామని ఉన్నత

Cbse విద్యార్థులకు అవకాశం

                                 - ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి


ప్యారీస్‌(చెన్నై), జూన్‌ 22: ఇంజనీరింగ్‌, ఆర్ట్స్‌ , సైన్స్‌, పాలిటెక్కిక్‌ కోర్సుల్లో సీబీఎస్ఈ విద్యార్థులు చేరేందుకు దరఖాస్తు చేసేందుకు మరో ఐదు రోజులు అవకాశం కల్పిస్తామని ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి తెలిపారు. గిండిలోని సాంకేతిక విద్య డైరెక్టరేట్‌ కార్యాలయ ప్రాంగణంలో ఇంజనీరింగ్‌ కోర్సులో అడ్మిషన్లకు ఉచిత సలహా కేంద్రం ఏర్పాటైంది. ఈ కేంద్రాన్ని బుధవారం పరిశీలించిన మంత్రి పొన్ముడి మీడియాతో మాట్లాడుతూ, ఇంజనీరింగ్‌ కోర్సులకు ఇప్పటివరకు 42,716 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. జూలై చివరి వారంలో సీబీఎస్ఈ ఫలితాలు విడుదయ్యే అవకాశముందని, ఆ విద్యార్థుల సౌకర్యార్ధం ఫలితాలు విడుదలైన తర్వాత మరో ఐదు రోజులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపారు. అదే సమయంలో కౌన్సెలింగ్‌ తేదీల్లో ఎలాంటి మార్పు లేదని, రాష్ట్ర విధానంలోనే విద్య కొనసాగాలన్నదే తమ ప్రభుత్వం ఉద్ధేశమన్నారు. పాలిటెక్నిక్‌లో ప్రవేశానికి గురువారం నుంచి జూలై 8వ తేది వరకు దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. ఈ ఏడాది 1.50 లక్షల ఇంజనీరింగ్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయని, పాలిటెక్నిక్‌ పూర్తయిన విద్యార్థులు అన్నా విశ్వవిద్యాలయంలో రెండో సంవత్సరం ఇంజనీరింగ్‌ కోర్సుల్లో చేరే విధానం ఈ ఏడాది నుంచి అమలు చేసినట్లు మంత్రి తెలిపారు.

Updated Date - 2022-06-23T16:11:46+05:30 IST