కార్పొరేట్‌కు ధీటుగా విద్యాభోదన

ABN , First Publish Date - 2021-04-13T05:44:25+05:30 IST

కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభోదన అందించేందుకు ప్రభు త్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు జిల్లా పరిషత్‌ అధ్య క్షురాలు దావ వసంత అన్నారు.

కార్పొరేట్‌కు ధీటుగా విద్యాభోదన
ధ్రువీకరణ పత్రాలు అందుకున్న ప్రధానోపాధ్యాయులతో జడ్పీ చైర్‌ పర్సన్‌

జడ్పీ చైర్‌ పర్సన్‌ దావ వసంత

జగిత్యాల టౌన్‌, ఏప్రిల్‌ 12:  కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభోదన అందించేందుకు ప్రభు త్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు జిల్లా పరిషత్‌ అధ్య క్షురాలు దావ వసంత అన్నారు. ప్రభుత్వ ఉన్నత, ప్రాథ మికోన్నత పాఠశాలల్లో నూతనంగా ఆంగ్ల మాధ్యమ తరగతులు బోధించేందుకు జిల్లా పరిషత్‌ ఆమోదం తెలుపుతూ జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలను జడ్పీ కార్యాలయంలో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యా యులకు, విద్యాకమిటీ చైర్మన్లకు సోమవారం అందజే శారు. అనంతరం వసంత మాట్లాడుతూ ప్రైవేటు ఉపా ధ్యాయులకు తిరిగి పాఠశాలలు ప్రారంభించేంత వరకు నెలకు రూ.2 వేలతో పాటు 25 కిలోల బియ్యం అంది స్తున్న గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్‌ అని అన్నారు. మూడు సంవత్సరాల నుండి జగిత్యాల జిల్లా రాష్ట్రంలోనే పదవ తరగతి ఉత్తీర్ణతలో అగ్రస్థానంలో నిలిచిందని ఆదే స్థాయిలో విధ్యార్థులకు ఉత్తమ భోదన అందిచాల్సిన బాధ్యత ఉందన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో శ్రీనాథ్‌రావు, డిప్యూటీ సీఈవో సంధ్యా రాణి, పీఏసీఎస్‌ చైర్మన్‌ పత్తిరెడ్డి మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.a

Updated Date - 2021-04-13T05:44:25+05:30 IST