విలువ ఆధారిత విద్యతోనే సమాజానికి మేలు: గవర్నర్‌

ABN , First Publish Date - 2022-03-10T00:24:05+05:30 IST

విలువ ఆధారిత విద్యతోనే సమాజానికి మేలు కలుగుతుందని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు.

విలువ ఆధారిత విద్యతోనే సమాజానికి మేలు: గవర్నర్‌

ఎచ్చెర్ల: విలువ ఆధారిత విద్యతోనే సమాజానికి మేలు కలుగుతుందని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలో బుధవారం నిర్వహించిన రెండో స్నాతకోత్సవంలో అమరావతి నుంచి కులపతి హోదాలో గవర్నర్‌ విశ్వభూషణ్‌ వర్చువల్‌ విధానంలో ప్రసంగించారు. సమాజంలో ఉన్న సవాళ్లను ఎదుర్కొనేలా యువత నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ‘నాణ్యమైన ఉన్నత విద్యకు పటిష్టతమైన నియంత్రణ, పారదర్శకత ఉండేలా వ్యవస్థలు అవసరం. సామాజిక స్పృహ కలిగేలా యువతను తయారు చేయాలి. కోవిడ్‌ కారణంగా అన్ని రంగాలతో పాటు విద్యారంగంపై కూడా తీవ్ర ప్రభావం పడింది. సామాజిక బానిసత్వం అణిచివేతకు, అణగారిన వర్గాల అభ్యున్నతికి విద్య సరైన ఆయుధం. నూతన జాతీయ విద్యా విధానం విద్యాభివృద్ధికి ఒక ప్రణాళికను నిర్ధేశించింది. 2035 నాటికి ఉన్నత విద్యలో స్థూల నమోదు 50 శాతం ఉండాలి’ అని గవర్నర్‌ విశ్వభూషణ్‌ తెలిపారు. 

Updated Date - 2022-03-10T00:24:05+05:30 IST