టెన్త్‌ పరీక్ష కేంద్రాల గుర్తింపులో..విద్యాశాఖాధికారులు బిజీ

ABN , First Publish Date - 2020-05-23T10:29:22+05:30 IST

టెన్త్‌ పరీక్ష కేంద్రాల గుర్తింపులో విద్యాశాధికారులు బిజీగా ఉన్నారు

టెన్త్‌ పరీక్ష కేంద్రాల గుర్తింపులో..విద్యాశాఖాధికారులు బిజీ

చిత్తూరు సెంట్రల్‌, మే 22: టెన్త్‌ పరీక్ష కేంద్రాల గుర్తింపులో విద్యాశాధికారులు బిజీగా ఉన్నారు. జిల్లాలో తొలుత 53,494 విద్యార్థులకు 265 పరీక్ష కేంద్రాలు గుర్తించారు. కరోనా నేపథ్యంలో భౌతికదూరం పాటించాల్సి రావడంతో పరీక్ష కేంద్రాల సంఖ్య 390కి చేరింది. ఈ సమయంలో ఎక్కడి విద్యార్థులు అక్కడే పరీక్షలు రాసే వెసులుబాటు కల్పించనుండటంతో మరిన్ని కేంద్రాలు అవసరం కానున్నాయి. దాంతో శుక్రవారం విద్యాశాఖాధికారులు గుర్తించిన కేంద్రాలను పరిశీలించారు. ఒక్కో గదికి ఎంతమంది విద్యార్థులను అనుమతించాలన్న దానిపై నివేదిక సిద్ధం చేశారు. ఈ వివరాలను రాష్ట్ర విద్యాశాఖకు పంపనున్నారు. 

Updated Date - 2020-05-23T10:29:22+05:30 IST