Abn logo
Nov 24 2020 @ 23:27PM

‘పాఠశాలల్లో కరోనా నివారణ చర్యలు చేపట్టాలి’

ఏలూరు కార్పొరేషన్‌, నవంబరు 24:కార్మికులు రైతాంగానికి వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ ఈనెల 26న జరిగే దేశ వ్యాప్త సమ్మెతో కనువిప్పు కలగాలని ఇఫ్టూ జిల్లా కార్యదర్శి యు.వెంకటేశ్వరరావు అన్నారు. ఏలూరు నగరంలోని పలు డివిజన్లలో వామపక్షాల నాయకులు, హమాలీలు సంయుక్తంగా సమ్మె విజయవంతం కోరుతూ మంగళవారం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కరోనాను అడ్డం పెట్టుకుని కష్టకాలంలో ఉన్న కార్మికులపై ప్రభుత్వాలు దాడి చేస్తున్నాయన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం లేబర్‌ కోడ్‌లకు వ్యవసాయ, విద్యుత్‌ సంస్కరణల చట్టాలకు వ్యతిరేకంగా కలిసిపోరాడాలని పిలుపునిచ్చారు. నిర్మాణ కార్మికుల నిధులు దారి మళ్లించిన జీవో నంబరు 17ను ఉపసంహ రించుకోవాలని కోరారు. స్థానిక జూట్‌మిల్లు సెంటర్‌ నుంచి ప్రారంభమైన బైక్‌ ర్యాలీ అంబికా సెంటర్‌, పెద్ద పోస్టాఫీసు, మెయిన్‌ బజార్‌, పవరుపేట, ఆర్‌ఆర్‌పేట మీదుగా ఫైర్‌స్టేషన్‌ వరకు కొనసా గింది. ఏఐటీయూసీ నాయకులు రెడ్డి శ్రీనివాసడాంగే, ఇఫ్టూ నగర ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బి. సోమయ్య, మంగరాజు, రాము, శ్రీనివాసరావు, సూరిబాబు, కనకదుర్గారావు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement