జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్‌ సిటీలో.. ఊపందుకున్న ఎడ్యుపోర్ట్‌

ABN , First Publish Date - 2020-08-11T16:13:25+05:30 IST

హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు సిటీలో ఒక ప్రత్యేకమైన అర్బన్‌ ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్న జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయిరోట్రోపొలిస్‌ లిమిటెడ్‌ (జీహెచ్‌ఎఎల్‌) విద్య, పరిశోధన సంస్థలను ఆకర్శించేలా ఓ అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషన్‌ క్లష్టర్‌ను సృష్టించేందుకు ఎడ్యుపోర్ట్‌ నిర్మాణాన్ని వేగవంతం చేసింది. దీనిని 100 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు.

జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్‌ సిటీలో.. ఊపందుకున్న ఎడ్యుపోర్ట్‌

సెయింట్‌ మేరిస్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీతో జీఎమ్‌ఆర్‌ ఒప్పందం 

సాంక్టా మారియా ఇంటర్నేషనల్‌ స్కూల్‌ అభివృద్ధి

100 ఎకరాల్లో ప్రపంచస్థాయి ఎడ్యుకేషనల్‌ క్లష్టర్‌ను నిర్మించనున్న ఎయిర్‌పోర్ట్‌ సిటీ


(ఆంధ్రజ్యోతి రంగారెడ్డి అర్బన్‌) : హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు సిటీలో ఒక ప్రత్యేకమైన అర్బన్‌ ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్న జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయిరోట్రోపొలిస్‌ లిమిటెడ్‌ (జీహెచ్‌ఎఎల్‌) విద్య, పరిశోధన సంస్థలను ఆకర్శించేలా ఓ అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషన్‌ క్లష్టర్‌ను సృష్టించేందుకు ఎడ్యుపోర్ట్‌ నిర్మాణాన్ని వేగవంతం చేసింది. దీనిని 100 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఎడ్యుపోర్ట్‌ అనేది జాతీయ, అంతర్జాతీయ సంస్థలను కలిగి అన్ని వయస్సులు, నేపథ్యాలు ఉన్న విద్యార్థులకు అవసరమైన అధ్యయన కోర్సులు అందుబాటులోకి తీసుకువచ్చే ఒక నాలెడ్జ్‌ హబ్‌. లెర్నింగ్‌, ట్రైనింగ్‌, రీసెర్చ్‌, ఎన్నోవేషన్‌ సెంటర్‌గా ఎడ్యుపోర్ట్‌లో బిజినెస్‌ స్కూల్‌, ఇంటర్నేషనల్‌ స్కూల్‌, ఏవియేషన్‌ అకాడమీ. ఎయిరోస్పేస్‌ ఇంజనీరింగ్‌, ఫ్లైట్‌ ట్రైనింగ్‌, సిమ్యులేటర్‌ ట్రైనింగ్‌, ఇంజిన్‌ మెయింటెనెన్స్‌ మొదలైనవి ఉంటాయు. ఈ ఎడ్యుకేషన్‌ క్లష్టర్‌లోని కొన్ని ముఖ్యమైన సంస్థలుగా చిన్మయ విద్యాలయ, షూలిచ్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌,  జీఎమ్‌ఆర్‌ ఏవియేషన్‌ అకాడమీ, ఫ్లైట్‌ సిమ్యులేషన్‌ టెక్నిక్‌ సెంటర్‌ (ఎఫ్‌ఎ్‌సటీసీ), సీఎ్‌ఫఎం సౌత్‌ ఏషియా ట్రైనింగ్‌ సెంటర్‌, ప్రాట్‌ అండ్‌ విట్నీ ఇండియా ట్రైనింగ్‌ సెంటర్‌ ఉండనున్నాయి. ఎడ్యుపోర్టు విజన్‌కు మరింత ఊతమిస్తూ, జీఎంఆర్‌ ఇటీవల రెసిరెన్షియల్‌ అకాడమిక్‌ ఫెసిలిటీ అయిన సాంక్టా మారియా ఇంటర్నేషనల్‌ స్కూల్‌ నిర్మాణం కోసం హైదరాబాద్‌ కేంద్రంగా సెయింట్‌ మేరిస్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీతో ఒప్పందంపై సంతకాలు చేసింది. ఈ ఒప్పందం ప్రకారం సాంక్టా మారియా స్కూల్‌ వారు రెండో కే12 (కిండర్‌ గార్డెన్‌ నుంచి 12వ తరగతి వరకు) వెంచర్‌ కోసం ఎయిర్‌పోర్టు సిటీలో 15 ఎకరాల సర్విస్డ్‌ భూమిని కేటాయిస్తారు. అయితే ఇది 2022 ఏడాదిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.


ఎయిర్‌పోర్టు సిటీలో విద్యాసంస్థ ఏర్పాటు సంతోషకరం: జీబీఎస్‌ రాజు, బిజినెస్‌ చైర్మన్‌ 

సెయింట్‌ మేరిస్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ, జీఎమ్‌ఆర్‌ హైదరాబాద్‌ పోర్ట్‌ సిటీలో విద్యాసంస్థను ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఈ అవకాశాన్ని ఆహ్వానిస్తున్నాం.



ఉన్నత విద్య అందించే వ్యవస్థను నెలకొల్పాలన్నదే లక్ష్యం: అమన్‌ కపూర్‌, సీఈవో, ఎయిర్‌పోర్టు ల్యాండ్‌ డెవల్‌పమెంట్‌

హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు సిటీలో ఏర్పాటవుతున్న మొదటి విద్యాసంస్థ ఇది. ప్రపంచస్థాయి విద్యతో పాటు పరిశోధన సంస్థలను నెలకొల్పి, ఉన్నత విద్యను అందించే వ్యవస్థను నెలకొల్పాలన్న మా లక్ష్యానికి ఇది అనుగుణంగా ఉంది.  


అంతర్జాతీయ గుర్తింపు పొందిన విద్యాసంస్థలను పెంపొందించడమే లక్ష్యం

ప్రయోజనకరమైన విద్యకోసం పిల్లలు అభివృద్ధి చెందడానికి ఒక సమగ్రమైన దృక్పథాన్ని అనుసరించాలన్న విశ్వాసం కలిగిన జీఎంఆర్‌ గ్రూపుతో జట్టు కట్టడంపై సెయింట్‌ మేరీస్‌ సొసైటీ ఎంతో ఆనందిస్తోంది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన గొప్ప విద్యాసంస్థలను పెంపొందించడమే లక్ష్యం. 

- ఆరోగ్యరెడ్డి, ప్రెసిడెంట్‌ అండ్‌ చైర్మన్‌, సెయింట్‌ మేరీస్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ

Updated Date - 2020-08-11T16:13:25+05:30 IST