ఆగస్టు 24, 25న ఎడ్‌సెట్‌

ABN , First Publish Date - 2021-04-17T07:15:31+05:30 IST

రెండేళ్ల బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎడ్‌సెట్‌ నోటిఫికేషన్‌ శుక్రవారం విడుదలైంది.

ఆగస్టు 24, 25న ఎడ్‌సెట్‌

  • 19 నుంచి దరఖాస్తులు
  • నోటిఫికేషన్‌ విడుదల
  • పరీక్షా విధానంలో మార్పులు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): రెండేళ్ల బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎడ్‌సెట్‌ నోటిఫికేషన్‌ శుక్రవారం విడుదలైంది. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 19 నుంచి జూన్‌ 15 వరకు కొనసాగుతుంది. రూ.1,000 ఆలస్య రుసుముతో జూలై 20 వరకు సమర్పించవచ్చు. దరఖాస్తు రుసుం రూ.650గా నిర్ణయించారు. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) విధానంలో  ఆగస్టు 24, 25 తేదీల్లో ఎడ్‌సెట్‌ ఉంటుంది. ఈసారి ఎడ్‌సెట్‌ పరీక్ష విధానాన్ని మార్చారు. ఇంతవరకు వివిధ సబ్జెక్టుల వారీగా ర్యాంకులు కేటాయిస్తుండగా.. ఇకనుంచి అన్నింటికీ కలిపి ర్యాంకులు కేటాయించనున్నారు. 150 మార్కుల ప్రశ్నప్రతం ఆబ్జెక్టివ్‌ టైప్‌ (మల్టిపుల్‌ ఛాయిస్‌) విధానంలో ఉంటుంది. వీటిని రెండు గంటల వ్యవధిలో రాయాల్సి ఉంటుంది. మ్యాథమెటిక్స్‌, సైన్స్‌, సోషల్‌, టీచింగ్‌ అప్టిట్యూట్‌, జనరల్‌ ఇంగ్లిష్‌, కంప్యూటర్‌ అవేర్‌నెస్‌ సబ్జెక్టులకు 20మార్కుల చొప్పున మొత్తం 120 మార్కులు, జనరల్‌ నాలెడ్జ్‌, ఎడ్యుకేషనల్‌ ఇష్యూ్‌సకి 30 మార్కులు ఉంటాయి. 

Updated Date - 2021-04-17T07:15:31+05:30 IST