కావలసిన పదార్థాలు: ఇడ్లీలు- అయిదు, ఛాట్ మసాలా, కారప్పొడి- స్పూను, ఉప్పు, నూనె- తగినంత.
తయారుచేసే విధానం: ఒక్కో ఇడ్లీని పొడవుగా కట్ చేయాలి. పాన్‌లో నూనె కాగాక ఇడ్లీ ముక్కలను అన్నివైపులా దోరగా వేయించాలి. వీటన్నిటినీ ఓ బౌల్లోకి తీసుకుని పైన ఉప్పూ, కారం, ఛాట్ మసాలా వేసి అన్నిటినీ పైకీ కిందకీ చేస్తే ఇడ్లీఫ్రై రెడీ. సాయంత్రం స్నాక్‌గా బాగుంటుంది.