ఫైల్స్‌ షేరింగ్‌కు ఎడ్జ్‌బ్రౌజర్‌ ‘డ్రాప్‌’

ABN , First Publish Date - 2022-06-04T09:00:02+05:30 IST

ఫైల్స్‌ షేరింగ్‌ను మరింత సులువుగా చేసుకునేందుకు వీలుగా మైక్రోసాఫ్ట్‌ సరికొత్త ఫీచర్‌ ‘ఎడ్జ్‌’ బ్రౌజర్‌ను డెవలప్‌ చేస్తోంది.

ఫైల్స్‌ షేరింగ్‌కు ఎడ్జ్‌బ్రౌజర్‌ ‘డ్రాప్‌’

ఫైల్స్‌ షేరింగ్‌ను మరింత సులువుగా చేసుకునేందుకు వీలుగా మైక్రోసాఫ్ట్‌ సరికొత్త ఫీచర్‌ ‘ఎడ్జ్‌’ బ్రౌజర్‌ను  డెవలప్‌ చేస్తోంది. డివైస్‌లు అన్నింటి నుంచి షేర్‌ చేసుకునేందుకు వీలుగా ఉండే  దీనిని ‘డ్రాప్‌’ అంటారు. ఎడ్జ్‌ బ్రౌజర్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుంటే ఈ సౌలభ్యం అందుబాటులోకి వస్తుంది. ఎక్స్‌డీఏ డెవలపర్స్‌ నివేదిక ప్రకారం ఎడ్జ్‌బ్రౌజర్‌  - డెస్క్‌టాప్‌ వెర్షన్‌లో సైడ్‌బార్‌పై దీనిని ఉంచారు. మేనేజింగ్‌ సర్వీస్‌ మాదిరిగా ఈ ఆప్షన్‌ ఉంటుంది. 


మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌కు చెందిన ‘డ్రాప్‌’ ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ ఇన్‌సైడర్స్‌కు కేనరీ చానెల్‌లో లేటెస్ట్‌ వెర్షన్‌ అందుబాటులో ఉంది. అంతమాత్రాన కేనరీ చానల్‌ యూజర్లు అందరూ దీన్ని చూడలేరు. దీన్ని పరీక్షించాలనుకుంటే లేటెస్ట్‌ వెర్షన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అందుకు కేనరీ చానల్‌ లేటెస్ట్‌ వెర్షన్‌ కూడా ఉండాలి. అదృష్టం బాగుంటే డ్రాప్‌ లభిస్తుంది. అంతా అనుకున్నట్టు జరిగితే మూడు చుక్కల మెనూ వద్దే ఇది లభిస్తుంది.


టెక్స్ట్‌ నుంచి ఫైల్‌ అటాచ్‌మెంట్స్‌ వరకు దాదాపుగా అన్నింటినీ డ్రాప్‌ ఫీచర్‌తో పంపుకోవచ్చు. క్లౌడ్‌ స్టోరేజీని కూడా ఇది అందిస్తుంది. యూజర్‌ వన్‌డ్రైవ్‌ అకౌంట్‌లో  ఎంత స్పేస్‌ ఉందో కూడా చెబుతుంది. డ్రాప్‌కే పరిమితం కాకుండా మైక్రోసాఫ్ట్‌ మరికొన్ని కొత్త ఫీచర్లపై కూడా పనిచేస్తోందని సమాచారం. 

Updated Date - 2022-06-04T09:00:02+05:30 IST