‘ఎన్ని అడ్డంకులనైనా ఎదుర్కొంటాం’

ABN , First Publish Date - 2022-05-03T16:15:56+05:30 IST

ప్రజలకు సేవచేయడంలో వెనకాడేది లేదని, ఎన్ని అడ్డంకులనైనా ధైర్యంగా ఎదుర్కొంటామని అన్నాడీఎంకే ఉప సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి

‘ఎన్ని అడ్డంకులనైనా ఎదుర్కొంటాం’

                             - Edappadi palani swami ధీమా


ప్యారీస్‌(చెన్నై): ప్రజలకు సేవచేయడంలో వెనకాడేది లేదని, ఎన్ని అడ్డంకులనైనా ధైర్యంగా ఎదుర్కొంటామని అన్నాడీఎంకే ఉప సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ధీమా వ్యక్తం చేశారు. కళ్లకుర్చి జిల్లా అన్నాడీఎంకే అన్నా కార్మికుల సంఘం ఆధ్వర్యంలో కళ్లకుర్చిలో మేడే బహిరంగసభ ఆదివారం రాత్రి జరిగింది. ఈ సభలో పళనిస్వామి పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో పదేళ్లు సాగిన అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో కరెంటు సమస్య ఏర్పడలేదని, అయితే డీఎంకే అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న నేపధ్యంలో కరెంటు కోతలతో పాటు ధరలు విపరీతంగా పెరిగాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ పాల్గొన్న కార్యక్రమంలోనే విద్యుత్‌కు అంతరాయం ఏర్పడిందని, ఇప్పటికైనా విద్యుత్‌ బోర్డు అధికారులు ఈ సమస్యను పరిష్కరింపజేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. నీట్‌ నుంచి రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని దివంగత ముఖ్యమంత్రి జయలలిత కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారని, ఆమె మరణం అనంతరం అన్నాడీఎంకే కూడా ఈ అంశంపై పోరాడిందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన వెంటనే ఆస్తి పన్ను 150 శాతం పెంచారని, మరికొన్ని రోజుల్లో విద్యుత్‌ ఛార్జీలు 40 శాతం వరకు పెంచేందుకు డీఎంకే ప్రభుత్వం ఆలోచిస్తూ వస్తోందని, అంతేకాకుండా కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగే అవకాశముందని, దీనిపై ప్రజలు స్వచ్ఛంధంగా పోరాడాలని ఎడప్పాడి పిలుపునిచ్చారు.

Read more