abhishek Banerjee, ఆయన భార్యకు ఈడీ సమన్లు

ABN , First Publish Date - 2021-08-28T21:03:30+05:30 IST

తృణమూల్ ఎంపీ, సీఎం మమత అల్లుడు అభిషేక్ బెనర్జీకి, ఆమె భార్య రుజీరా బెనర్జీకి ఈడీ శనివారం సమన్లు

abhishek Banerjee, ఆయన భార్యకు ఈడీ సమన్లు

కోల్‌కతా : తృణమూల్ ఎంపీ, సీఎం మమత అల్లుడు అభిషేక్ బెనర్జీకి, ఆమె భార్య రుజీరా బెనర్జీకి ఈడీ శనివారం సమన్లు జారీ చేసింది. బొగ్గు అక్రమ రవాణాకు సంబంధించిన కేసులో మనీలాండరింగ్ నేరానికి గాను సెప్టెంబర్ 1న విచారణకు హాజరు కావాలని ఈడీ వారిని ఆదేశించింది. వీరితో పాటు ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులకు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 8,9 తేదీల్లో విచారణకు హాజరు కావాలని వారిని ఆదేశించింది. 

భయపెడితే భయపడేవారం కాదు : అభిషేక్

ఈడీ సమన్ల విషయంపై ఎంపీ అభిషేక్ బెనర్జీ ఘాటుగా స్పందించారు. భయపెడితే భయపడేవారం తాము కాదని స్పష్టం చేశారు. ప్రజల హక్కులను కాలరాస్తున్న, ప్రజాస్వామ్యా్న్ని ఖూనీ చేస్తున్న రాష్ట్రాల్లో తాము పర్యటిస్తామని, చివరి రక్తపు బొట్టు వరకూ బీజేపీపై పోరాడుతూనే ఉంటామని తేల్చి చెప్పారు. ‘‘తమను భయపెట్టాలని చూస్తున్నారు. భయపెడితే మిన్నకుంటామని అనుకుంటున్నారు. కానీ మేం భయపడం. ఈడీ, సీబీఐని ఉసిగొలిపితే భయపడం. వారికి తలవంచం. త్రిపురలో మా రాజకీయ ఎదుగుదలను దమ్ముంటే ఆపాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు సవాల్ విసురుతున్నా. నేతాజీ, వివేకానంద, రామకృష్ణ పరమహంస పుట్టిన గడ్డ బెంగాల్’’ అని అభిషేక్ బెనర్జీ పేర్కొన్నారు.  

Updated Date - 2021-08-28T21:03:30+05:30 IST