gold smuggling caseలో స్వప్నా సురేష్‌కు ఈడీ సమన్లు

ABN , First Publish Date - 2022-02-08T16:16:28+05:30 IST

కేరళ బంగారం స్మగ్లింగ్ కేసులో కీలక నిందితురాలైన స్వప్నా సురేష్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది....

gold smuggling caseలో స్వప్నా సురేష్‌కు ఈడీ సమన్లు

కొచ్చి: కేరళ బంగారం స్మగ్లింగ్ కేసులో కీలక నిందితురాలైన స్వప్నా సురేష్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది.స్వప్నా సురేష్ బుధవారం కీలక పత్రాలతో ఈడీ కార్యాలయంలో విచారణకు రావాలని ఈడీ సమన్లలో కోరింది. ఈ కేసు విషయంలో యూఏఈ కాన్సులేట్ ప్రభుత్వంతో ముఖ్యమంత్రి మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ, కేసులో నిందితుడైన ఎం శివశంకర్ సంప్రదింపులు జరిపారని స్వప్నా ఆరోపించారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి అనుకూలంగా ఆడియో క్లిప్‌ను విడుదల చేయాలని శివశంకర్ పట్టుబట్టారని స్వప్న చేసిన ఆరోపణలను కూడా ఈడీ పరిశీలిస్తోంది. సీఎంఓకి క్లీన్ చిట్ ఇచ్చిన ఆమె ఆడియో క్లిప్ ను శివశంకర్‌తో సన్నిహితంగా ఉండే వ్యక్తుల సలహా మేరకు రూపొందించినట్లు స్వప్న తెలిపారు.


Updated Date - 2022-02-08T16:16:28+05:30 IST