National Herald case: 21న హాజరుకావాలని Sonia gandhi కి ED సమన్లు

ABN , First Publish Date - 2022-07-11T23:25:34+05:30 IST

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్...

National Herald case: 21న హాజరుకావాలని Sonia gandhi కి ED సమన్లు

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald case)లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gandhi)కి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోమవారంనాడు తాజాగా సమన్లు పంపింది. ఈనెల 21వ తేదీన విచారణకు రావాలని ఆదేశించింది. విచారణ ముందుకు హాజరుకావాలని సోనియాగాంధీకి ఈడీ ఇచ్చిన నాలుగు వారాల గడువు ఈనెల 22తో ముగియనుంది.


సమన్ల వాయిదా కోరుతూ గత జూన్‌లో సోనియాగాంధీ చేసిన లిఖిత పూర్వక విజ్ఞప్తిని ఈడీ అంగీకరించింది. కోవిడ్ నుంచి, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ నుంచి పూర్తిగా కోలుకునేంత వరకూ కొద్ది వారాల పాటు తన హాజరును వాయిదా వేయాలని సోనియాగాంధీ కోరారు. జూన్ 12 కోవిడ్ అనంతర సమస్యలతో సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరిన సోనియాగాంధీ అదే నెల 18న డిశ్చార్జి అయ్యారు. దీనికి ముందు, మనీ లాండరింగ్ కేసులో జూన్ 8న తమ ముందు హాజరుకావాలని  ఈడీ సమన్లు పంపింది. ఈ క్రమంలో జూన్ 1న సోనియాగాంధీకి కోవిడ్ పాజిటివ్ రావడంతో ఈడీని మరింత గడువు కోరారు.

Updated Date - 2022-07-11T23:25:34+05:30 IST