సుశాంత్ కేసులో కీలక మలుపు.. రియా చక్రవర్తికి ఈడీ నోటీసులు

ABN , First Publish Date - 2020-08-06T03:11:55+05:30 IST

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసులో రియా చక్రవర్తికి...

సుశాంత్ కేసులో కీలక మలుపు.. రియా చక్రవర్తికి ఈడీ నోటీసులు

ముంబై: బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసులో రియా చక్రవర్తికి ఈడీ నోటీసులు పంపినట్లు తెలిసింది. ఆగస్ట్ 7న మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా ఆమెకు సమన్లు పంపినట్లు సమాచారం. సుశాంత్ తండ్రి బీహార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈడీ రియాకు సమన్లు పంపినట్లు తెలిసింది. బీహార్ పోలీసులు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో విచారణ మొదలుపెట్టినప్పటి నుంచి రియా కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే.


సుశాంత్ ఖాతా నుంచి రియా రూ.15 కోట్లు అజ్ఞాత ఖాతాకు బదిలీ చేసిందని, సుశాంత్ డబ్బుతో రియా పార్టీలు చేసుకునేదని సుశాంత్ తండ్రి బీహార్ పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసులో సీబీఐ విచారణకు కేంద్రం కూడా తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో.. బీహార్ పోలీసులకు అందుబాటులో లేకుండా కుటుంబంతో సహా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన రియా చక్రవర్తి అజ్ఞాతాన్ని వీడక తప్పని పరిస్థితి. రియా కనిపించకుండా వెళ్లిపోయిన తర్వాత తాను అమాయకురాలినని, సత్యమే గెలుస్తుందని ఒక వీడియో మాత్రమే రియా ఇప్పటివరకూ విడుదల చేసింది.



Updated Date - 2020-08-06T03:11:55+05:30 IST