ఎంపీ నామా ఇల్లు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు

ABN , First Publish Date - 2021-06-11T17:37:15+05:30 IST

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. రూ.1064 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో ముమ్మర సోదాలు నిర్వహిస్తోంది.

ఎంపీ నామా ఇల్లు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. రాంచీ ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్ ప్రాజెక్ట్‌లో నిధుల మళ్లింపుపై ఈడీ రంగంలోకి దిగింది. ఈ ప్రాజెక్ట్ కోసం మధుకాన్ కంపెనీ రూ.1100 కోట్లు లోన్ తీసుకుంది. అందులో 264 కోట్లు రూపాయలు నిధులు పక్క దారి పట్టించునట్టు మధుకాన్ కంపెనీపై అభియోగాలొచ్చాయి. నిధుల మళ్లింపుపై 2019లో నామాపై సీబీఐ కేసు నమోదు చేసింది. 2020లో సీబీఐ చార్జీ షీట్ ఫైల్ చేసింది. మధుకాన్ ఇన్ఫ్రా, మధుకాన్ ప్రాకెక్ట్, మధుకాన్ టోల్ వే, ఆడిటర్లను చార్జీషీట్‌లో సీబీఐ నిందితులుగా చేర్చింది.


నామా ఇంటితో పాటు ఆఫీసుల్లోనూ ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. ఖమ్మం, హైదరాబాద్‌లలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. రాంచీ ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్ట్ పూర్తి చేయకపోవడంపై రాంచీ హైకోర్టులో పలు పిటిషన్‌లు దాఖలయ్యాయి. ఈ ప్రాజెక్ట్ స్కాంపై విచారణ చేయాలని ఇన్వెస్టిగేషన్ అధికారులకు జార్ఖండ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నామా నాగేశ్వరరావుతో పాటు రాంచి ఎక్స్‌ప్రెస్ వే సీఎండీ కె. శ్రీనివాసరావు, కంపెనీ డైరెక్టర్లు సీతయ్య, పృధ్వీ తేజల ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.

Updated Date - 2021-06-11T17:37:15+05:30 IST