CM సహాయకుడి bank ఖాతాలో పట్టుబడ్డ రూ.11 కోట్లు

ABN , First Publish Date - 2022-07-16T01:55:44+05:30 IST

దీనికి ముందు ఈ నెల 7న జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ బార్హెట్, రాజ్‌మహల్, మిర్జా చౌకి, బర్హార్వలాంటి 19 ప్రాంతాల్లో ప్రాంతాల్లో ఈడీ రైడ్లు నిర్వహించింది. ఆయా ప్రాంతాల నుంచి 5.34 కోట్ల డబ్బుని కొన్ని పత్రాల్నీ స్వాధీనం చేసుకుని సీజ్ చేసింది..

CM సహాయకుడి bank ఖాతాలో పట్టుబడ్డ రూ.11 కోట్లు

రాంచీ: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్(Jharkhand Chief Minister Hemant Soren) సహాయకుడు అయిన పంకజ్ మిశ్రా(Pankaj Mishra) చెందిన 37 బ్యాంకు ఖాతాల్లో 11.88 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) శుక్రవారం తెలిపింది. ఇదంతా అక్రమ మైనింగ్‌ల ద్వారా వచ్చిన సొమ్మని ఈడీ అధికారులు తెలిపారు. కాగా, బ్యాంకు ఖాతాల్లో లభించిన డబ్బంతటినీ ఈడీ సీజ్ చేసింది. పంకజ్ సహాయకుడు దాహూ యాదవ్‌కు చెందిన బ్యాంకు అకౌంట్లను సైతం పరిశీలించిన ఈడీ.. ఆ ఖాతాల్లోని డబ్బును సైతం సీజ్ చేసింది.


దీనికి ముందు ఈ నెల 7న జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ బార్హెట్, రాజ్‌మహల్, మిర్జా చౌకి, బర్హార్వలాంటి 19 ప్రాంతాల్లో ప్రాంతాల్లో ఈడీ రైడ్లు నిర్వహించింది. ఆయా ప్రాంతాల నుంచి 5.34 కోట్ల డబ్బుని కొన్ని పత్రాల్నీ స్వాధీనం చేసుకుని సీజ్ చేసింది. తాజాగా భారీ ఎత్తున డబ్బుతో పాటు అక్రమంగా నడిపిస్తున్న ఐదు స్టోన్ క్రషర్లను, ఐదు ఫైర్‌ఆర్మ్ కర్ట్రిడ్జ్‌లను ఈడీ సీజ్ చేసింది. వివిధ రకాల వ్యక్తులు ఇచ్చిన వివరాల ఆధారంగా రైడ్లు నిర్వహించిన ఈడీ.. పక్కా ఆధారాలతోనే అక్రమ సొమ్మును గుర్తించామని తెలిపింది. కాగా, రాష్ట్రంలో అక్రమ మైనింగ్ ద్వారా 100 కోట్ల రూపాయలకు పైగానే అక్రమ ఆర్జన ఉంటుందని ఈడీ పేర్కొంది.

Updated Date - 2022-07-16T01:55:44+05:30 IST