Chinese visa scam: కార్తి చిదంబరంపై మనీలాండరింగ్ కేసు నమోదు

ABN , First Publish Date - 2022-05-25T21:06:49+05:30 IST

చైనీయులకు వీసాలను మంజూరు చేయడానికి సంబంధించిన కుంభకోణం

Chinese visa scam: కార్తి చిదంబరంపై మనీలాండరింగ్ కేసు నమోదు

న్యూఢిల్లీ : చైనీయులకు వీసాలను మంజూరు చేయడానికి సంబంధించిన కుంభకోణం కేసులో కార్తి చిదంబరంతోపాటు మరికొందరిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేసును నమోదు చేసింది. 2011లో కేంద్ర హోం మంత్రిగా పి చిదంబరం పని చేసిన కాలంలో ఈ కుంభకోణం జరిగినట్లు ఆరోపించింది. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దాఖలు చేసిన కేసు ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) ప్రకారం ఈ కేసును నమోదు చేసింది. 


Enforcement Directorate (ED) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం,  CBI నమోదు చేసిన కేసు ఆధారంగా ఈ కేసును నమోదు చేశారు. వేదాంత గ్రూప్ కంపెనీ తల్వండి సబో పవర్ లిమిటెడ్ (TSPL) పంజాబ్‌లో ఓ విద్యుత్తు ప్లాంటును ఏర్పాటు చేసింది. ఈ సంస్థకు చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్ రూ.50 లక్షలు లంచం కార్తి చిదంబరానికి, ఆయన సన్నిహితుడు ఎస్ భాస్కరరామన్‌కు చెల్లించారు. ఈ నేర ప్రతిఫలంపై ఈడీ దర్యాప్తు చేస్తుంది. దర్యాప్తులో భాగంగా నిందితులను ప్రశ్నిస్తుంది. 


ఇదిలావుండగా, కార్తి చిదంబరం (Karti Chidambaram) మాట్లాడుతూ, ఈడీ ఆరోపణలను తోసిపుచ్చారు. ఇవి వేధింపులు కాకపోతే మరేమిటని ప్రశ్నించారు.


Updated Date - 2022-05-25T21:06:49+05:30 IST