Mumbaiలో దావూద్ ఇబ్రహీం బంధువుల ఇళ్లపై ఈడీ దాడులు

ABN , First Publish Date - 2022-02-15T16:18:55+05:30 IST

దావూద్ ఇబ్రహీంపై మనీలాండరింగ్ కేసులో ముంబైలో ఈడీ అధికారులు మంగళవారం దాడులు చేశారు....

Mumbaiలో దావూద్ ఇబ్రహీం బంధువుల ఇళ్లపై ఈడీ దాడులు

ముంబై: దావూద్ ఇబ్రహీంపై మనీలాండరింగ్ కేసులో ముంబైలో ఈడీ అధికారులు మంగళవారం దాడులు చేశారు.అండర్ వరల్డ్ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంపై మనీలాండరింగ్ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారిస్తోంది.పరారీలో ఉన్న అండర్‌వరల్డ్ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంపై ఇటీవల నమోదైన కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముంబై సమీప ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది.ఈడీ దాడుల్లో ఓ మహారాష్ట్రకు చెందిన ఓ రాజకీయ నాయకుడు కూడా ఉన్నారు. దావూద్ ఇబ్రహీం సోదరి దివంగత హసీనా పార్కర్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు జరిపారు.దావూద్ ఇబ్రహీం 1980వ సంవత్సరంలో భారతదేశం నుంచి పారిపోయినా అండర్ వరల్డ్ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు.


ఇటీవల పంజాబ్ రాష్ట్రంలో ఇబ్రహీం నియంత్రణలో ఉన్న ముంబై అండర్ వరల్డ్ క్రైమ్ సిండికేట్ కు చెందిన డీ కంపెనీని కనుగొన్నారు. దావూద్ ఇబ్రహీం ఓ పోలీసు కానిస్టేబుల్ కుమారుడు. ముంబైలోని డోంగ్రీ ప్రాంతంలో గ్యాంగ్ వార్ లతో అతని నేర జీవితం ప్రారంభమైంది.డోంగ్రీలో హాజీ మస్తాన్ ముఠా సభ్యులతో సన్నిహితంగా ఉన్నాడు.


Updated Date - 2022-02-15T16:18:55+05:30 IST