Gold Mines: మంచిరెడ్డి కిషన్ రెడ్డికి ఈడీ ప్రశ్నల వర్షం

ABN , First Publish Date - 2022-09-28T00:59:42+05:30 IST

క్యాసినో (Casino) వ్యవహారం కొద్ది రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే..

Gold Mines: మంచిరెడ్డి కిషన్ రెడ్డికి ఈడీ ప్రశ్నల వర్షం

హైదరాబాద్ (Hyderabad): క్యాసినో (Casino) వ్యవహారం కొద్ది రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. విదేశాల్లో క్యాసినో నిర్వహించినట్లు తేలడంతో ప్రధాన సూత్రధారి చీకోటి ప్రవీణ్ (Chikoti Praveen)ను పోలీసులు విచారించారు. అయితే అదే సమయంలో డబ్బులు కూడా భారీగా చేతులు మారినట్లు గుర్తించడంతో ఈడీ (Enforcement Directorate) కూడా రంగంలోకి దిగింది. క్యాసినోలో పాల్గొన్న రాజకీయ నేతల ఆర్థిక లావాదేవీలపై దృష్టి పెట్టింది. దీంతో పలువురు కీలక నేతలను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఆ తర్వాత కొందరికి నోటీసులిచ్చారు. విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 


తాజాగా ఈడీ అధికారులు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (Trs Mla ManchiReddy KishanReddy)ని ప్రశ్నించారు. మంచి రెడ్డి కిషన్ రెడ్డి ఇతర ప్రాంతాలకు వెళ్లి క్యాసినోలో పాల్గొన్నారని.. హవాలా, మనీలాండరింగ్‌ ద్వారా డబ్బులు బదలాయించినట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో విదేశాల్లో వ్యాపారాలకు సంబంధించిన విషయంలో ఈడీ అధికారులు ఆరా తీశారు. గోల్డ్ మైన్‎కు సంబందించిన వ్యాపారాల్లో జరిగిన అవకతవకలపై గతంలోనే ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే ఆయన అప్పుడే వివరణ ఇచ్చారు. కానీ ఈడీ అసంతృప్తి వ్యక్తం చేసింది. మంచిరెడ్డి ఇచ్చిన వివరణ సరిగా లేదని భావించింది. దీంతో ఆగస్ట్‎లో నోటీసులు జారీ చేసింది.  


తాజాగా వ్యక్తిగతంగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి..ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. దీంతో ఆయనను ఈడీ అధికారులు ప్రశ్నించారు. మంచిరెడ్డి ఇచ్చిన స్టేట్‎మెంట్‎ను రికార్డు చేశారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘనపైనా ఆరా తీశారు. విచారణ ముగియడంతో ఈడీ కార్యాలయం నుంచి మంచిరెడ్డి కిషన్ రెడ్డి.. మీడియా కంట పడకుండా వెళ్లిపోయారు. 


Updated Date - 2022-09-28T00:59:42+05:30 IST