ఆమ్ ఆద్మీ పార్టీకి ఈడీ నోటీసులు... ఫేక్ కంపెనీల నుంచి చందాల వసూళ్లపై విచారణ!

ABN , First Publish Date - 2021-09-13T17:53:26+05:30 IST

ed issues notice to aam aadmi party

ఆమ్ ఆద్మీ పార్టీకి ఈడీ నోటీసులు... ఫేక్ కంపెనీల నుంచి చందాల వసూళ్లపై విచారణ!

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు పంపింది. ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగు ఫేక్ కంపెనీల నుంచి చందాలు వసూలు చేసిన ఉదంతం 2014లో చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగు ఫేక్ కంపెనీల నుంచి రెండు కోట్ల రూపాయలు వసూలు చేసిందని రిజిస్ట్రర్ ఆఫ్ కంపెనీస్(ఆర్ఓసీ) పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మొత్తాన్ని డెహ్రాడూన్‌కు చెందిన ఒక కంపెనీ.. ఫేక్ కంపెనీల పేరుతో అందించింది. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే రాఘవ్ చడ్డా ఒక ట్వీట్‌లో... మోదీ ప్రభుత్వ ఫేవరెట్ ఏజెన్సీ ఈడీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి లవ్ లెటర్ వచ్చిందని తెలిపారు. దీని గురించి అన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తామన్నారు. 

Updated Date - 2021-09-13T17:53:26+05:30 IST